గోవాలో ‘డిస్కో రాజా’ సంద‌డి

#DiscoRaja, Disco Raja Movie Shooting updates, Disco Raja Movie Updates, Disco Raja Shoot Happening in Goa, Disco Raja Telugu Movie Latest News, Disco Raja Telugu Movie Shooting Latest News, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ క‌థానాయికలుగా నటిస్తుండ‌గా… సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ గోవా పరిసర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. మరో వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారని సమాచారం. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు… యువ సంగీత సంచ‌ల‌నం ఎస్.ఎస్.థమన్ బాణీలు అందిస్తున్నాడు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్ 20న ‘డిస్కో రాజా’ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here