రాజ‌శేఖ‌ర్‌కి జోడీగా అమ‌లా పాల్‌?

Rajasekhar And Amala Paul To Pair Up Again?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rajasekhar Upcoming Movie News,Rajasekhar Next Film Updates,Rajasekhar New Movie News,Rajasekhar Latest Movie News,Rajasekhar Next Film with Amala Paul

త‌మిళ అనువాద చిత్రం `ప్రేమ‌ఖైదీ`(2011)తో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైంది కేర‌ళ‌కుట్టి అమలా పాల్. ఆపై `బెజ‌వాడ‌`, `నాయ‌క్‌`, `ఇద్ద‌ర‌మ్మాయిల‌తో`, `జెండాపై క‌పిరాజు` వంటి స్ట్ర‌యిట్ తెలుగు పిక్చ‌ర్స్‌లో హీరోయిన్‌గా న‌టించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… దాదాపు నాలుగేళ్ళ త‌రువాత మ‌రో తెలుగు చిత్రానికి సంత‌కం చేసింద‌ట‌. అంతేకాదు.. గ‌త నాలుగు చిత్రాల్లో యువ క‌థానాయ‌కుల‌తో ఆడిపాడిన అమ‌ల‌… ఈ సారి ఓ సీనియ‌ర్ హీరో ప‌క్క‌న క‌నువిందు చేయ‌నుంద‌ట‌. ఆ హీరో మ‌రెవ‌రో కాదు.. డా.రాజ‌శేఖ‌ర్‌. ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న క‌న్న‌డ రీమేక్‌లో నాయిక పాత్ర కోసం అమ‌లా పాల్ పేరుని ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం. అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర కావ‌డంతో… అమ‌ల కూడా వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్‌. త్వ‌ర‌లోనే అమ‌ల ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఇటీవ‌ల అమ‌ల ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన `ఆమె` విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. అందులో విల‌క్ష‌ణ పాత్ర‌లో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను విస్మ‌య‌ప‌రిచింది అమ‌ల‌.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =