అర్జున్ రెడ్డి సినిమా తర్వాత కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. అప్పుడప్పుడు బాలీవుడ్ కి వెళ్లినా కూడా అటెన్షన్ మొత్తం తనే గ్రాబ్ చేస్తుంటాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అది అలా ఉంటే ఫ్యాషన్ విషయంలో విజయ్ దేవరకొండ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ ఫాలో అవ్వుతాడన్న సంగతి తెలిసిందే . అందులో భాగంగా ఆయన ‘రౌడీ’ అనే దుస్తుల బ్రాండ్‌ను కూడా ప్రారంభించాడు. ఇప్పుడు ఇండియా లోనే అతి పెద్ద బ్రాండ్ అయిన మీ బాజ్ కు ఎండార్స్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. బాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్స్ లో ఒక్కడైన కరణ్ జోహారే దీనికి కారణం అని తెలుస్తుంది.
త్వరలోనే కరణ్ విజయ్ ను బాలీవుడ్ లో లాంచ్ చేయాలని చూస్తున్నాడట. ఈ విషయంపై గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే స్పెషల్ ఇంట్రెస్ట్ తో కరణ్ పలు హిందీ ప్రాజెక్ట్స్ లో పెద్ద పెద్ద ఎండార్స్ మెంట్ డీలింగ్స్ లో విజయ్ పేరును తీసుకొస్తున్నాడట. అందుకే ఇంత పెద్ద బ్రాండ్ కు అంబాసిడర్ గా చేసే అవకాశం దక్కినట్టు తెలుస్తుంది.
నిజానికి కరణ్ కు విజయ్ అంటే మొదటినుండీ కాస్త స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. అందుకే తను తీసిన సినిమా డియర్ కామ్రేడ్ సినిమాతోనే బాలీవుడ్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేసాడు.. అందుకే ఆ సినిమా హిందీ రైట్స్ ను కొన్నాడు. కానీ సినిమా అనుకున్నంత విజయం సాదించలేకపోయేసరికి డ్రాప్ అయ్యాడు. కానీ విజయ్ తో ఎలాగైనా సరే సినిమా తీయాలనే చూస్తున్నాడు కరణ్. చూద్దాం మరి విజయ్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో?కరణ్ కల ఎప్పుడు నెరవేరుతుందో..?
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: