RRRమూవీ లో యంగ్ “టైగర్” ఫైట్

Jr NTR Shooting For An Action Scene In RRR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,Jr NTR Action Scene In RRR Movie,#RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ RRR 2020 సంవత్సరం జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ కొమరంభీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఒక కథానాయికగా నటిస్తున్నారు.
కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న RRRమూవీ షూటింగ్ ప్రస్తుతం బల్గేరియా దేశం లో జరుగుతుంది. తన మూవీస్ లో హీరోలఇంట్రడక్షన్ సీన్ ను అద్భుతంగా చిత్రీకరించే రాజమౌళి RRRమూవీ లో హీరోలను అద్భుతంగా ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ మూవీ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైగర్ తో చేసే ఫైట్ తో ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ఫైట్ కొరకు ఫారిన్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న RRRమూవీ కై నందమూరి, మెగా అభిమానులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here