మ్యూజిక‌ల్ హిట్‌ ‘అంతం’కు 27 ఏళ్ళు

27 Years For Musical Blockbuster Antham Telugu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Antham Movie Updates,Antham Telugu Movie Latest News,Antham Movie Completes 27 Years,Nagarjuna Antham Telugu Movie Completes 27 Years,#Antham

‘కింగ్’ నాగార్జున కెరీర్‌లో ప‌లు మ్యూజిక‌ల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘అంతం’ ఒక‌టి. `శివ‌` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌రువాత నాగ్‌, ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచినా… ఆడియో ప‌రంగా మాత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఇందులో నాగ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళ న‌టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కలం నుండి జాలువారిన పాటలకు… బాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.డి.బర్మన్, టాలీవుడ్ ఏస్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ ఎం.ఎం.కీరవాణి, మణిశర్మ స్వరాలు సమకూర్చారు. “నీ నవ్వు చెప్పింది నాతో”, “ఓ మైనా”,“ఎంత సేపైన”, “ఊహలేవో రేగే”, “గుండెల్లో దడదడ”, “చలెక్కి ఉందనుకో” … ఇలా ఈ చిత్రంలోని అన్ని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగుతో పాటు హిందీ(‘ద్రోహి’)లోనూ తెరకెక్కిన ఈ సినిమాని కె.ప్రసాద్, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. 1992 సెప్టెంబర్ 11న విడుదలై మ్యూజికల్ హిట్‌గా నిలచిన ‘అంతం’… నేటితో 27 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − seventeen =