విజయ్ బాటలో సందీప్ వంగా..!

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Sandeep Reddy Vanga Follows vijay Deverakonda, Sandeep Reddy Vanga to Become Producer, Kabir Singh director Sandeep Reddy Vanga To Produce Bollywood Film, Kabir Singh director Sandeep Reddy Vanga to co-produce

అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ సందీప్ వంగా, హీరో విజయ్ దేవరకొండ ఇద్దరి రేంజ్ మారిపోయింది అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ అయితే ఆ సినిమా తర్వాత టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు. క్రాంతి మాధవన్ తో ఒక సినిమా, పూరీ జగన్నాధ్ తో మరొక సినిమా, ఆనంద్ అన్నామలై హీరో సినిమా.. ఇంకా నాగ్ అశ్విన్ తో మరో సినిమా ఇలా వరుసగా సినిమాలు క్యూలో పెట్టాడు. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క తన సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నిర్మాతగా సినిమా చేస్తున్నాడు..

ఇక ఇక్కడ అర్జున్ రెడ్డి సినిమాతో హిట్ కొట్టి ఏకంగా బాలీవుడ్ లో డైరెక్ట్ చేసే అవకాశాన్ని కొట్టేసాడు సందీప్ వంగా. సందీప్ వంగా డైరెక్షన్ చేస్తేనే రీమేక్ చేస్తానని షాహిద్ కపూర్ చెప్పాడంటేనే అర్ధం చేసుకోవచ్చు సందీప్ కి ఎంత క్రేజ్ ఉందో. ఇక షాహిద్ కోరిక మేరకు హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

ఇక తాజా సమాచారం ప్రకారం సందీప్ కూడా విజయ్ బాటలో వెళ్లనున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో సందీప్ మరో సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను తానే నిర్మిస్తున్నాడట. కబీర్ సింగ్ నిర్మాతలతో కలిసి తన రెండో చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు.. నిర్మాతగా వ్యవహరించనున్నట్టు అటు బాలీవుడ్ లో.. ఇటు టాలీవుడ్ లో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here