‘కేజీఎఫ్’ డైరెక్ట‌ర్‌తో మ‌హేష్‌?

2019 Latest Telugu Film News, KGF Director meets Mahesh Babu, KGF director Prashanth Neel With Mahesh Babu, Mahesh babu latest movie news, Mahesh Babu Next Project Detils, Mahesh Babu Next With KGF Director, Mahesh Babu To Work With KGF Director, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

‘కేజీఎఫ్’… ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ కన్నడ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం… ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్ 2’ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు ప్రశాంత్. ఇదిలా ఉంటే… ‘కేజీఎఫ్’తో ఆకట్టుకున్న ప్రశాంత్‌తో సినిమాలు చేయడానికి టాలీవుడ్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ యన్టీఆర్ ఓ డ్యాన్స్ బేస్డ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా… తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ యాక్షన్ డ్రామా చేయడానికి పచ్చ జెండా ఊపినట్లు తెలిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ‘కేజీఎఫ్ 2’ చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్… ఇటీవల మహేష్‌ను సంప్రదించి ఓ లైన్‌ను నెరేట్ చేసాడ‌ని… మ‌హేష్‌కు ఆ లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయమన్నాడని సమాచారం. అంతేకాదు… యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మహేష్ హోమ్ బ్యానర్ జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్ నిర్మించనుందని టాక్. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి… త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − five =