‘జయలలిత’కు ఎవరు న్యాయం చేస్తారో..?

ఇప్పుడు ఎక్కడ చూసినా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కగా.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి కూడా విదితమే. అయితే ఈ బయోపిక్ విషయంలో మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకూ తెరకెక్కిన పలువురి ప్రముఖుల బయోపిక్ లు ఒక్కటి మాత్రమే తెరకెక్కాయి. కానీ ఒక్క జయలలిత బయోపిక్ పై మాత్రం మూడు సినిమాలు వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏ ఎల్ దర్శకత్వంలో ‘తలైవి’ పేరుతో ఒక సినిమా రూపొందిస్తుండగా ఈ సినిమాలో కంగనా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 15 నుండి ప్రారంభించి.. 2020 మేలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరో బయోపిక్ లో నిత్యామీనన్ నటిస్తుంది. విబ్రి మీడియా బ్యానర్ పై విష్ణు ఇందూరి నిర్మాణ సారథ్యం లో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో జయలలిత జీవితం ఆధారంగా మరో వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కి గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. ప్రశాంత్ గతంలో ‘కిడారి’ అనే తమిళ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘క్వీన్’ టైటిల్ తో తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది. ఈ వెబ్ సిరీస్ లో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి రమ్యకృష్ణ ఫస్టులుక్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. జయలలితగా ఆమె ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో యంగ్ జయలలితగా అనిఖా సురేంద్రన్ కనిపిస్తుండగా.. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ పాత్రలో మలయాళ నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ నటించినట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్‌ను ఎంఎక్స్ ప్లేయర్ సౌజన్యంతో నిర్మించారు. త్వరలోనే ఈ బయోపిక్ వెబ్ సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్‌లో ప్రసారం కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తేనున్నట్టు తెలుస్తుంది.

ఈ రెండు సినిమాలతో పాటు ప్రియదర్శిని దర్శకత్వంలో ఐరన్ లేడీ పేరుతో నిత్యామీనన్ ప్రధాన పాత్రలో మరో సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి అమ్మ వర్ధంతిని పురస్కరించుకుని నిత్యామీనన్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. జయలలిత జీవితంలో జరిగిన అనేక సంఘటనలు.. ఎదుర్కొన్న ఇబ్బందులు ఇలా అన్ని అంశాలను ఈ బయోపిక్ లో చూపించనున్నారట చిత్రయూనిట్.

మరి ఈ మూడు బయోపిక్ లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి.. ఎవరు జయలలిత పాత్రకు న్యాయం చేస్తారు.. ఎవరు జయలలిత కు బాగా సెట్ అయ్యారు అన్న విషయాలు తెలియాలంటే ఇవి రిలీజ్ అయ్యేంత వరకూ ఆగాల్సిందే. ఈ లోపు అమ్మ పాత్రకు ఎవరు న్యాయం చేయగలరని మీరు అనుకుంటున్నారో మీ ఓట్ ద్వారా తెలియజేయండి.

'జయలలిత'కు ఎవరు న్యాయం చేస్తారో..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − nineteen =