నేను బీహార్ లో పుడితే గుడి కడతా అన్నాడు..!

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Sure Thing Fan Reaction to Saaho, Saaho Movie Latest News, Fan Reaction to Saaho, Saaho movie Fan Reaction, Prabhas Fans Saaho Movie reaction

ఒకే ఒక్క సినిమాతో ఏకంగా ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాన్ని కొట్టేసాడు సుజీత్. షార్ట్ ఫిలిమ్స్ తో మొదలై.. రన్ రాజా రన్ సినిమాతో హిట్ కొట్టి రెండో సినిమానే 350 కోట్ల బడ్జెట్ తో ఓ సినిమాని తియగలిగే స్థాయికి ఎదిగాడు. రెండేళ్ళు కష్టపడి హాలీవుడ్ లెవెల్ లో.. పెద్ద పెద్ద నటీనటులతో.. అంతర్జాతీయ స్టంట్ మాస్టర్లతో యాక్షన్ ఎపిసోడ్స్ ను సాహో ను తెరకెక్కించి అందరితో సాహో అనిపించుకున్నాడు. గత నెల (ఆగస్టు ) 30 న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాకు హిందీ లో కూడా మంచి ఆదరణ లభించింది. నిజంగా చెప్పాలంటే తెలుగులో కంటే కూడా హిందీ లోనే కూడ ఈ సినిమాకు ఎక్కువ ఆదరణ లభించింది అని చెప్పొచ్చు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజీత్ కూడా హిందీలో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పై పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు… ఈ సినిమాకి హిందీలో మంచి ఆదరణ లభించిందనీ, ముఖ్యంగా బీహార్ నుంచి మంచి స్పందన వస్తోందనీ… బీహార్ నుండి కొంతమంది ప్రేక్షకులు ఫోన్ లు చేసి సినిమా బాగుందని.. ఒకాయన.. బీహార్‌లో పుట్టి ఉంటే మీకు గుడి కట్టేసేవారు అని మెచ్చుకున్నారట.

మరి హిందీ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఈ సినిమా చూసినా ప్రతివాళ్ళుకు హిందీ సినిమా చూసిన ఫీలింగే వస్తుంది. ఏదిఏమైనా ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద సినిమా తీయడం గ్రేటే. ఏదో కొద్ధి మందికి నచ్చ లేదేమో కానీ చాలా మందికి నచ్చింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =