“క్వీన్” వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ ఫస్ట్ లుక్

2019 Latest Telugu Film News, Ramya Krishna Impresses With Jayalalitha Look, Ramya Krishnan to play Jaya in Tamil Nadu CM Jayalalitha, Jayalalitha Look by Ramya Krishna, Ramya Krishna Latest Movie News, Ramya Krishnan In Gautham Menon's Web Series , Jayalalitha Look From Gautham Menon Web Series, Ramya Krishna Role in Jayalalitha Bio Pic, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Ramya Krishnan as Queen

లెజండరీ యాక్ట్రెస్, దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా పలు మూవీస్ రూపొందనున్న విషయం తెలిసిందే. సినీ నటి గా కెరీర్ ప్రారంభించి తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన జయలలిత, రాజకీయాలలో ఎంటరయి పురుషాధిక్య ప్రపంచాన్ని ఒక స్ట్రాంగ్ మహిళగా ఎదుర్కొని, పోరాడి తమిళనాడు ముఖ్య మంత్రి గా తనదైన ముద్ర ను వేశారు. తమిళనాడు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి అమ్మ గా, తలైవి గా ప్రజలచే కీర్తింపబడ్డారు. జయలలిత జీవితం లో అనేక ఆసక్తికర విశేషాలు ఉన్నాయి.

పేపర్ టేల్స్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రియదర్శిని దర్శకత్వంలో జయలలిత పాత్ర లో నిత్యా మీనన్ నటించనున్న ఐరన్ లేడీ మూవీ, విబ్రి మీడియా బ్యానర్ పై AL విజయ్ దర్శకత్వంలో కంగన రనౌత్ కథానాయిక గా రూపొందే తలైవి మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకొని షూటింగ్ కు సిద్ధంగా వున్నాయి. ప్రముఖ దర్శకుడు భారతీ రాజా, నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి జయలలిత బయోపిక్ మూవీస్ ను అనౌన్స్ చేశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ జయలలిత బయోపిక్ ను క్వీన్ పేరుతో వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు. జయలలిత పాత్రలో ప్రముఖ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో రెండు ఎపిసోడ్స్ షూటింగ్ జరుపుకొన్నట్టుగా సమాచారం. క్వీన్ వెబ్ సిరీస్ లోని రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో జెండా అంచు గల తెల్ల చీరలో వేదిక పై నిలబడి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న రమ్యకృష్ణ (జయలలిత ) పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. క్వీన్ వెబ్ సిరీస్ MX ప్లేయర్ లో ప్రసారం కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here