మ‌ల‌యాళంలోనూ సంద‌డి చేయ‌నున్న ‘అల వైకుంఠపురములో’ ?

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Ala Vaikunthapuramulo Hungama in Kerala, Ala Vaikunthapuramulo To Release in Kerala, Ala Vaikunthapuramulo Movie Latest News, Allu Arjun New Movie Shooting Updates, Allu arjun Next To release In malayalam

తెలుగు నాటే కాదు కేరళలోనూ తనకంటూ ప్ర‌త్యేక మార్కెట్ ను సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అందుకే బన్నీ నటించిన ప్రతీ సినిమా… టాలీవుడ్‌తో పాటు మాలీవుడ్‌లోనూ (డబ్బింగ్ వెర్షన్) సందడి చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే… ఇప్పుడు బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అల… వైకుంఠపురములో…’ చిత్రాన్ని కూడా మలయాళంలో అనువదించి విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు… ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్‌కు సంబంధించి ‘అంగు వైకుంఠపురత్తు’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసారని సమాచారం.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కి సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తైన వెంటనే… నాయకానాయికలపై ఓ పాటను షూట్ చేయ‌డానికి విదేశాలకు పయనమ‌వనుందట యూనిట్. కాగా… ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం… త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 7న టీజ‌ర్‌ను రిలీజ్ చేయనుందని టాక్.

పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, జయరామ్, రాజేంద్రప్రసాద్, సుశాంత్, నివేదా పేతురాజ్, న‌వ‌దీప్‌, సునీల్‌ ముఖ్య భూమికలు పోషిస్తున్నారు.

గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘అల… వైకుంఠపురములో…’ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here