న‌గ‌ర శివార్లలో విజ‌య్ దేవ‌ర‌కొండ సంద‌డి

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Vijay Deverakonda New Movie Shoot Happening In City Outskirts, Vijay Deverakonda New Movie, Vijay Deverakonda New Movie Shooting Updates, Vijay Deverakonda Latest Movie News , Vijay Deverakonda Shooting in City Outskirts

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ (‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న‌ సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘బ్రేక‌ప్’ అనే టైటిల్ ప్ర‌చారంలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ నిర్మిస్తోంది. ఇందులో విజ‌య్ సింగ‌రేణి ఉద్యోగిగా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ హైదరాబాద్ న‌గ‌ర‌ శివార్లలో జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం… ఫైట్ మాస్టర్ కన‌ల్ కణ్ణ‌న్ నేతృత్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ బృందంపై యాక్షన్ ఎపిసోడ్‌లో భాగంగా ఓ చేజింగ్ సీన్‌ను తెరకెక్కిస్తున్నార‌ట‌.

కాగా… చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ డిసెంబర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని టాక్‌.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here