అక్టోబ‌ర్ నెల‌లోనే వ‌స్తున్న `రాజు గారి గ‌ది` సిరీస్‌

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Raju Gari Gadhi 3 To Release In The Lucky Month, Raju Gari Gadhi 3 , Raju Gari Gadhi Sequel, Raju Gari Gadhi 3 Movie Latest News, Raju Gari Gadhi 3 Release Updates,Raju Gari Gadhi 3 Release Date, Raju Gari Gadhi 3 Release Date Fixed

బుల్లితెర వ్యాఖ్యాత‌గా కెరీర్‌ను ప్రారంభించి… ఆన‌క‌ ‘జీనియస్’(2012) చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేసాడు ఓంకార్‌. ఆ సినిమా తర్వాత భారీ విరామం తీసుకున్న ఓంకార్‌… దాదాపు మూడేళ్ళ గ్యాప్ త‌రువాత‌ ‘రాజు గారి గది’తో ప‌ల‌క‌రించాడు. హారర్ కామెడీ ఫిల్మ్ గా రూపొందిన ఈ చిత్రం 2015 దసరా(అక్టోబ‌ర్ 22)కి విడుదలై మంచి విజ‌యం సాధించింది. క‌ట్ చేస్తే… రెండేళ్ళ గ్యాప్ త‌రువాత ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘రాజు గారి గది 2’ ను రూపొందించాడు ఓంకార్‌. ‘కింగ్’ నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం… 2017 దీపావళి సంద‌ర్భంగా (అక్టోబ‌ర్ 13) రిలీజై మంచి ఫ‌లితాన్ని అందుకుంది.

ఈ నేప‌థ్యంలో… మ‌ళ్ళీ రెండేళ్ళ త‌రువాత‌ ‘రాజు గారి గది’ ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా ‘రాజు గారి గది 3’ను తెర‌కెక్కిస్తున్నాడు ఓంకార్‌. అవికా గోర్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఈ ఏడాది దసరా (అక్టోబ‌ర్ నెల‌) సీజ‌న్‌లో ప్రేక్షకులను ప‌ల‌క‌రించ‌నుంది. అంటే… ఓంకార్ వ‌రుస‌గా `రాజు గారి గ‌ది` సిరీస్ చేస్తుండ‌డ‌మే కాకుండా… ఆ యా చిత్రాల‌ను అక్టోబ‌ర్ నెల‌లోనే టార్గెట్‌ చేసుకుంటున్నాడ‌న్న‌మాట‌.

మ‌రి… ఓంకార్‌ గ‌త రెండు చిత్రాల‌కు అచ్చొచ్చిన అక్టోబ‌ర్, ఫెస్టివ‌ల్‌ సెంటిమెంట్స్‌… మూడోసారి కూడా వ‌ర్క‌వుట్ అవుతాయేమో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here