నిత్యా 50వ సినిమా ఇంట్రెస్టింగ్ పోస్టర్

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Nithya Menen Interesting Look from Aaram Thirukalpana Movie Out, Nithya Menen First Look From Aaram Thirukalpana, Nithya Menen First Look Out From New Movie, Nithya Menen First Look Released From Aaram Thirukalpana

కెరీర్ మొదటి నుండి విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది నిత్యా మీనన్. సినిమాల్లో తనకు ఎంత ప్రాధాన్యత ఉంది.. తన రోల్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని చూసుకుంటుంది. అందుకే చిన్న పాత్ర అయినా సరే ఎలాంటి అభ్యంతరం లేకుండా చేస్తుంది. ఇక ఇటీవలే బాలీవుడ్ లో మిషన్ మంగళ్ సినిమాతో కూడా హిట్ కొట్టింది. ఇప్పుడు తాజాగా మరో సినిమాతో వస్తుంది నిత్యా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అజయ్ దేవలోక దర్శకత్వంలో నిత్యా ప్రధాన పాత్రలో కొత్త సినిమా తెరకెక్కుతుంది. ఇది నిత్యా 50వ సినిమా. ‘ఆరం తిరుకల్పన’ పేరుతో తెరకెక్కనున్న ఈ మలయాళ చిత్రం తెలుగు, తమిళ భాషలలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ ని నిత్యా మీనన్ తన ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. ఈ సినిమా త్వరలో కానుందని తెలిపింది. మరి పోస్టర్ చూస్తుంటే మరో డిఫరెంట్ స్టోరీ తోనే వస్తున్నట్టు తెలుస్తుంది. జాతుల వలసలు వంటి ఓ భిన్నమైన కథతో వినూత్నంగా దర్శకుడు అజయ్ దేవలోక తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాకు సంబందించిన వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 8 =