బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్’కు 18 ఏళ్ళు

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, 18 Years For Blockbuster Nuvvu Naaku Nachavu Movie, Nuvvu Naaku Nachavu Telugu Movie , Venkatest Starrer Nuvvu Naaku Nachavu Movie, 18 Years Completed For Nuvvu Naaku Nachavu Movie, 18 Glorified Years For Nuvvu Naaku Nachavu Movie

‘విక్టరీ’ వెంకటేష్ క‌థానాయ‌కుడిగా ప‌లు విజ‌య‌వంత‌మైన కుటుంబ క‌థా చిత్రాలు తెర‌కెక్కాయి. వాటిలో ‘నువ్వు నాకు నచ్చావ్’ ఒకటి. కె.విజయభాస్కర్ రూపొందించిన‌ ఈ చిత్రంతో ఆర్తి అగర్వాల్ కథానాయికగా ప‌రిచ‌యం కాగా… ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని, సుధ, ఎం.ఎస్.నారాయణ, హేమ, సునీల్, బ్రహ్మానందం, సుదీప (పింకీ), ఆశాసైని, పృథ్వీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని నిర్మించారు.

ఈ సినిమా గురించి చెప్పుకుంటే… ముందుగా గుర్తుకొచ్చేది త్రివిక్రమ్ అందించిన‌ క‌థ‌, మాటలు. ఓ వైపు హాస్య సంభాష‌ణ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని గిలిగింత‌లు పెడుతూనే… మరోవైపు భావోద్వేగ స‌న్నివేశాల్లో హృదయానికి హత్తుకునేలా మాటలు రచించారు త్రివిక్ర‌మ్‌. ఇక ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, భువనచంద్ర గీత ర‌చ‌న‌లో… కోటి అందించిన స్వ‌రాలు శ్రోత‌ల‌ను విశేషంగా అల‌రించాయి. “ఉన్న మాట చెప్పలేవు”, “ఆకాశం దిగివచ్చి”, “ఓ నవ్వు చాలు”, “నా చూపే నిను”, “ఒక్కసారి చెప్పలేవా”, “ఓ ప్రియతమా”… ఇలా ప్రతీ పాట రంజింప‌జేసింది.

ఉత్తమ కుటుంబ క‌థా చిత్రంగా `నంది` పురస్కారాన్ని అందుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను… కన్నడంలో ‘గౌరమ్మ’ పేరుతోనూ, తమిళంలో ‘వసీగర’ టైటిల్‌తోనూ, బెంగాలిలో ‘మజ్ను’గానూ రీమేక్ చేసారు. 2001 సెప్టెంబర్ 6న విడుదలై ఘన విజయం సాధించిన ‘నువ్వు నాకు నచ్చావ్’… నేటితో 18 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here