పోరాట ఘ‌ట్టాల్లో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Intresting Updates Of Sarileru Neekevvaru, Sarileru Neekevvaru Movie Latest news, Mahesh babu Sarileru Neekevvaru Movie, Sarileru Neekevvaru Team Shooting Fight scene in RFC, Sarileru Neekevvaru Fight scene, Sarileru Neekevvaru Movie Shooting Updates

‘స‌రిలేరు నీకెవ్వ‌రు’…. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మ‌హేష్‌కి జోడీగా ర‌ష్మిక మందన్న నటిస్తుండగా… లేడీ సూప‌ర్‌స్టార్‌ విజ‌య‌శాంతి ఓ శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో దర్శనమివ్వనున్నారు.

ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ రామోజీ ఫిలింసిటీలో జ‌రుగుతోంది. ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దిన కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్‌లో ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో మహేష్, కొంతమంది ఫైటర్లపై పోరాట ఘ‌ట్టాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ నెల 12 వరకు సాగే ఈ షెడ్యూల్‌లో విజయశాంతి కూడా పాల్గొంటున్న‌ట్లు తెలుస్తోంది.

రామబ్రహ్మం సుంక‌ర‌, `దిల్‌` రాజు, మ‌హేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు`కు… దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నాడు. 2020 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here