‘కుమారి 21ఎఫ్’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హెబ్బాపటేల్ మొదటి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఆ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించినా ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా ఆడిన సినిమాలు ఏమి లేవు. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఏం సినిమాలు లేక సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు హెబ్బా కు మరో బంపర్ ఆఫర్ దక్కినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘భీష్మ’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ సరసన నాయికగా రష్మిక మందన నటిస్తుంది. ఇక ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర కీలకంగా వుంటుందట. ఇక ఈ పాత్రలో హెబ్బా పటేల్ అయితే బాగుంటుందని భావించి హెబ్బాను అడగగా.. వెంటనే తాను ఓకే చెప్పేసిందట. ఇప్పుడు ఈ క్రేజీ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. మరి ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రల్లో నటించిన హెబ్బా.. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఈ పాత్రలో హెబ్బా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. మరి ఈ సినిమాతోనైనా అమ్మాయిడికి అవకాశాలు క్యూ కడతాయేమో చూడాలి ..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: