కార్తికేయ కొత్త సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, kartikeya New Movie Title First Look Gets a Release Date, kartikeya New Movie Title First Look Release Date Locked, kartikeya New Movie Title First Look Release Date Fixed, kartikeya New Movie Title First Look Release Date Annponced, kartikeya New Movie, kartikeya Latest Movie News

మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’ తో మంచి హిట్ కొట్టిన కార్తికేయ హిప్పితో కాస్త వెనుకపడి గుణ 369 తో మరోసారి ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. నాని విలన్ గా నటించి గ్యాంగ్ లీడర్ సినిమా ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉండగా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా మరో సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాను కూడా ‘ఆర్ ఎక్స్100’ సినిమాను నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఒక రకంగా ఇది కార్తికేయ సొంత బ్యానర్ అనుకోవాలి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. అయితే ఫస్ట్ లుక్, టైటిల్ ను ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నట్టు ఓ పోస్టర్ ద్వారా తెలియజేసారు. చిన్నపిల్లాడి చేయి, పక్కన పాల బాటిల్ అందులో మందు చూడటానికి చాలా ఆకట్టుకునే విధంగా ఉంది పోస్టర్. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమా నుంచి త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి.

మరి ఇంతకు ముందు ఈ సినిమాకు ’90 ML’ అనే టైటిల్ ను అనుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి పోస్టర్ చూస్తుంటే అలానే ఉంది. చూద్దాం ఏం టైటిల్ ఫిక్స్ చేశారో.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here