క‌థానాయ‌కుడిగా నాని ప్ర‌యాణానికి 11 ఏళ్ళు

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, 11 Years For Natural Star Nani In Tollywood, Natural Star Nani Completes 11 years in TFI, Natural Star Nani Latest Movie News, Nani 11 Glorified years In TFI, Nani Successful Journey In Tollywood

`ప‌క్కింటి అబ్బాయి` పాత్ర‌ల‌కు చిరునామాగా నిల‌చిన ఈ త‌రం క‌థానాయ‌కుడు నాని. కేవ‌లం ఆ త‌ర‌హా భూమిక‌ల‌కే ప‌రిమితం కాకుండా వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల్లోనూ భాగ‌మ‌వుతూ త‌న స‌హ‌జ‌ న‌ట‌న‌తో నేచుర‌ల్ స్టార్ అనిపించుకున్నాడు ఈ టాలెంటెడ్ యంగ్ హీరో. అంతేకాదు… హ్యాట్రిక్ విజయాలే కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో… డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించి ఈ త‌రం క‌థానాయ‌కుల్లో ఓ అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు నాని. ఇక ఇటీవల విడుదలైన ‘జెర్సీ’తో న‌టుడిగా మ‌రో మెట్టు ఎక్కి విమర్శకుల ప్రశంస‌లు అందుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాంటి నాని కెరీర్‌కు బీజం వేసిన చిత్రం ‘అష్టాచమ్మా’. స్వాతి కథానాయికగా నటించిన ఈ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌కి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించాడు. అవసరాల శ్రీనివాస్, భార్గవి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని ఆస్కార్ వైల్డ్ రచించిన ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’(1895) అనే నాటకం స్పూర్తితో తెరకెక్కించారు. 2008 సెప్టెంబర్ 5న విడుదలైన ‘అష్టాచమ్మా’తో క‌థానాయ‌కుడిగా కెరీర్‌ను ప్రారంభించిన నాని… నేటితో 11 ఏళ్ళ చిత్ర‌ ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకుంటున్నాడు. మున్ముందు… నాని మ‌రిన్ని వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లు పోషిస్తూ…న‌టుడిగా ఉన్న‌త శిఖ‌రాలు చేరుకోవాల‌ని ఆశిద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 3 =