బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘శభాష్ రాముడు’కు 60 ఏళ్ళు

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, 60 years For Sabash Ramudu Movie, 60 years Completed Sabash Ramudu Movie, 60 Glorified years For Sabash Ramudu, Sabash Ramudu Movie, Sabash Ramudu Telugu Movie, NTR Starrer Sabash Ramudu Movie Completed 60 Years

మహానటుడు నందమూరి తారక రామారావు, లెజెండరీ డైరెక్టర్ సి.ఎస్.రావు కాంబినేషన్‌లో పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసాయి. వాటిలో ‘శభాష్ రాముడు’ ఒకటి. ఎన్టీఆర్, దేవిక నాయకానాయికలుగా నటించిన ఈ సినిమాలో… రమణమూర్తి, రేలంగి, కాంతారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, ఆర్.నాగేశ్వరరావు, గిరిజ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వెంపటి సదాశివబ్రహ్మం కథను అందించగా… రాజశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్‌లాల్ నహతా, టి.అశ్వద్ధనారాయణ సంయుక్తంగా నిర్మించారు. హిందీ చిత్రం ‘బడా భాయి’(1957)కి రీమేక్‌గా ‘శభాష్ రాముడు’ను రూపొందించారు దర్శకుడు సి.ఎస్.రావు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెంపటి సదాశివబ్రహ్మం, శ్రీశ్రీ, కొసరాజు గీత రచనలో… ఘంటసాల వీనుల విందైన బాణీలను సమకూర్చారు. వాటిలో “జయమ్ము నిశ్చయమ్మురా”(కొసరాజు) “కలకల విరిసిన”(శ్రీశ్రీ) పాటలు ప్రజాదరణ పొందగా… “ఓ చందమామ ఇటు చూడరా”, “జాబిల్లి వెలుగులో”, “ఆశలే అలలాగా”, “ఓ దేవా మొరవినవా” వంటి పాటలు కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. 1959 సెప్టెంబర్ 4న విడుదలై ఘన విజయం సాధించిన ‘శభాష్ రాముడు’… నేటితో షష్టి పూర్తి చేసుకుంటోంది.

‘శభాష్ రాముడు’ – కొన్ని విశేషాలు:
* 1959వ సంవత్సరంలో ‘అప్పుచేసి పప్పుకూడు’, ‘రేచుక్క పగటిచుక్క’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత… ‘శభాష్ రాముడు’తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్.
* ‘అగ్గిరాముడు’ (1954) వంటి విజయవంతమైన సినిమా తరువాత ఎన్టీఆర్ కథానాయకుడిగా “రాముడు” టైటిల్‌తో తెరకెక్కిన చిత్రం ‘శభాష్ రాముడు’. ఇది కూడా ఘన విజయం సాధించడంతో “రాముడు” టైటిల్స్ ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో భాగమైపోయాయి. “రాముడు” పేరుతో దాదాపు 12 సినిమాల్లో నటించగా… వాటిలో సింహభాగం విజయం సాధించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 7 =