ఆన్ లైన్ లో సందడి చేస్తున్న సినిమాలు

Telugu Filmnagar,Latest Telugu Film News,2019 Telugu Movies News,Tollywood Cinema Updates,Telugu Movies Rocking The Digital Platforms,Latest Telugu Movies Available On Digital Platforms,New Telugu Movies Available On Digital Platforms,Most Popular OTT Platforms In India to Watch Movies,Best OTT Platforms to Watch Movies,2019 Telugu Movies Available On OTT Platforms,New Tollywood Movies Available On OTT Platforms,Latest Telugu Films Available On Digital Platforms,Aame Full Movie Now Available On Amazon Prime,Watch Nenu Lenu Telugu Full Movie Available On Prime Video,Kavacham Movie Available On Amazon Prime Video,Latest Telugu Movie Nede Naadhi Oke Katha Now Available On Sun Next,Care Of Kancharapalem Full HD Movie Available On Jio Cinema,Watch Jersey Movie Available on Zee5,Seven Telugu Movie Available on Netflix,Watch Jessie Telugu Movie Now Available on Viu,Prema Katha Chitram 2 Telugu Full Movie Available on Viu,Roshagadu Telugu Full Length Movie Now Available on Youtube

కనీసం వారానికో సినిమా అయినా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉంటుంది. ఇక సినిమాలు హిట్ అవ్వడం.. ఫట్ అవ్వడం అనేది కథలు.. కథలో ఉండే కంటెంట్ ను బట్టి ఉంటుందనుకోండి. మంచి టాక్ వస్తే చాలు సినిమా హిట్ అయినట్టే. కొద్ది రోజులు థియేటర్ లో ఆడినట్టే. ఒకవేళ ఫట్ అయితే రెండు మూడు రోజులకే థియేటర్ నుండి ప్యాక్ అప్ చెప్పాల్సిన పరిస్థితి. నిజానికి ఇప్పుడు ఆన్ లైన్ సైట్స్ రాజ్యమేలుతున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా, హిట్ సినిమా? ప్లాప్ సినిమా? అని లేదు రిలే అయిన కొద్దిరోజులకు ఆన్ లైన్ సైట్ లలో దర్శనమివ్వాల్సిందే. అందుకే ఇప్పుడు ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ పై కన్నేస్తున్నారు. రాబోయే భవిష్యత్తు కూడా దీనిపైనే ఉండటం తో.. డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంటున్నారు. మరి ఇటీవల రిలీజ్ అయిన సినిమాల్లో ఏ సినిమా ఏ ఆన్ లైన్ సైట్ అందుబాటులో ఉందో మీకోసం కింద వివరించబడ్డాయి..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆమె:

అమలాపాల్ నటించిన తాజా చిత్రం ‘ఆడై’. తెలుగులో ‘ఆమె’ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా…ఇక ఈ సినిమా విడుదలకు ముందే ఈ సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినా ఈ సినిమాలో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సోషల్ మెసేజ్ కూడా ఇచ్చాడు డైరెక్టర్. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర కామినిగా అమలాపాల్ చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో ఆమె తన నటనా విశ్వరూపాన్ని చూపిందని చెప్పవచ్చు. ఇక ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన ఈ సినిమా ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చింది. ‘అమెజాన్ ప్రైమ్’ లో ఈ సినిమాను అందుబాటులో ఉంచారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

నేను లేను:

హర్షిత్, శ్రీపద్మ జంటగా రాంకుమార్ దర్శకత్వంలో ఓ ఎస్ ఎం విజన్ -దివ్యాశిక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం నేను లేను. దర్శకుడు రాంకుమార్ సరికొత్త పాయింట్ తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించినంత విజయం దక్కించుకోలేకపోయింది. జులై 26న రిలీజ్ అయిన ఈ సినిమా ను అప్పుడే ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. ఈ సినిమాను ‘అమెజాన్ ప్రైమ్’ లో అందుబాటులో ఉంచారు.

కవచం:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కవచం మూవీ. మంచి ట్విస్టులతో తెరకెక్కిన ఈ సినిమాకు అనుకున్నంత విజయం దక్కించుకోలేకపోయిందని చెప్పొచ్చు. కానీ మంచి మంచి స్క్రీన్ ప్లే హతో తెరకెక్కించిన ఈ సినిమాకు చాలా మంది నుండి మంచి పాజిటివ్ టాకే వచ్చింది. ఇక ఈ సినిమా కూడా ఇప్పడు ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చింది. ‘అమెజాన్ ప్రైమ్’ లో ఈ సినిమాను అందుబాటులో ఉంచారు.

నీది నాది ఒకే కథ:

మొదటినుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. తాను చేసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక విభిన్నత ఉండేలా చూసుకుంటాడు. అలా చేసిన సినిమాల్లో నీది నాది ఒకే కథ. విద్యావ్యవస్థల లోపాలు, పిల్లలపై తల్లిదండ్రుల ఒత్తిడి లాంటి ఓ సున్నితమైన పాయింట్‌ను అందుకొని రూపొందించిన ఈ సినిమాకు మంచి ప్రశంసలే దక్కాయి. కమర్షియల్ హంగులకు దూరంగా.. మనం రోజు చూస్తూ ఉండే సంఘటనల నుండి ఒక కీలక పాయింట్ ను తీసుకొని.. సమాజాన్ని ఆలోచింప చేసే విధంగా వేణు ఉడుగుల ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను కూడా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. ‘సన్ నెక్స్ట్’ అనే ఆన్ లైన్ సైట్ లో ఈ సినిమా చూసే అవకావం ఉంది.

C/o కంచరపాలెం:

ఏడాదికి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి… కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాలు మాత్రమే మనసులని తాకుతాయి. అలాంటి సినిమానే గత ఏడాది రిలీజ్ అయిన C/o కంచరపాలెం. వాస్తవికతకు దగ్గరగా తీసిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. యంగ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకటేశ్ మ‌హా తొలి ప్రయత్నంలో భాగంగా ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ హంగులతో గిరిగీసుకున్న తెలుగు సినిమా కంచెలను చెరిపేసిందనే చెప్పాలి. విడుదలకు ముందే న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు ఎంపికైన ఈ సినిమా జాతీయ అవార్డు నామినేషన్స్ కు కూడా వెళ్ళింది. మరి థియేటర్ లో మిస్ అయిన ఈ సినిమాను ఇప్పుడు ఆన్ లైన్ లో చూసేయండి. ‘జియో సినిమా’ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

జెర్సీ:

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా నానికి మంచి హిట్ ఇచ్చింది. ఎమోషనల్ క్రికెట్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ ల నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఒక క్రికెటర్‌గా, లవర్‌గా, తండ్రిగా ఒక సగటు భర్తగా నాని నటించాడనే కంటే ఆ పాత్రలో జీవించాడని చెప్పొచ్చు. ఇక ఏదో తీసామన్నట్టు కాకుండా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కే సన్నివేశాలు చాలా నాచురల్‌గా తెరకెక్కించి…. సినిమాలో ఎమోషనల్ డ్రామాను పండించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ఇక ఈ సినిమా కూడా ఇప్పుడు ‘జీ5′ లో అందుబాటులో ఉంచారు. ఇంకెందుకు లేట్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

సెవెన్:

ఏడు ప్రధాన పాత్రలతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సెవెన్. నిజార్ షఫీ దర్శకత్వంలో హవీష్, రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ జూన్ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండు షేడ్స్ లో నటించిన రెజీనా నటన ఈ సినిమాకు మంచి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా కూడా ఆన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చింది. ‘నెట్ ఫ్లిక్స్’ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

జెస్సీ:

ప్రస్తుతం టాలీవుడ్ లో కామెడీ హర్రర్ సినిమాలకు మంచి ట్రెండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ జోనర్ లో ఎన్నో సినిమాలు తెరకెక్కగా… ఇటీవలే ఇదే జోనర్ లో వచ్చి మంచి టాక్ తెచ్చుకున్న సినిమా జెస్సీ. అతుల్ కుల‌కర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, అర్చ‌నా శాస్త్రి, ఆషిమా న‌ర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హార‌ర్ థ్రిల్ల‌ర్ `జెస్సీ` ను తన మొదటి చిత్రంతోనే మంచి ప్రయాతం చేసాడు. ‘అసలు దెయ్యాలు ఉన్నాయా.. మనిషి చనిపోయిన తరువాత ఆత్మలు ప్రేతాత్మలుగా మారతాయా? లేదంటే అవి వట్టి రూమర్లేనా అన్న నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాను ‘వియూ’ లో అందుబాటులో ఉంచారు. మీరు కూడా ఈ సినిమాను చూసి థ్రిల్ ను ఫీల్ అవ్వండి.

ప్రేమకథ చిత్రమ్ 2:

మారుతీ దర్శకత్వంలో సుధీర్ బాబు, నందిత, ప్రవీణ్, సప్తగిరి కాంబినేషన్ లో వచ్చిన కామెడీ హర్రర్ సినిమా ప్రేమకథా చిత్రమ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి కామెడీ హర్రర్ సినిమాలకు ఈ సినిమానే బీజం వేసిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా ప్రేమకథ చిత్రమ్ 2. సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. కానీ ఈ సినినిమాను ఆన్ లైన్ లో చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు లేట్ ఈ సినిమాను ‘వియూ’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని చూసేయండి.

రోషగాడు:

తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్నాడు తమిళ్ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని. ఈ నేపథ్యంలోనే తాను చేసిన సినిమా రోషగాడు ను తెలుగులో రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమా ఇక్కడ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఇక ఈ సినిమా ను కూడా థియేటర్ లో చూడటం మిస్ అయ్యారా…? ఏం పర్వాలేదు ఇప్పుడు ఈ సినిమాను ‘యూ ట్యూబ్’ లో అందుబాటులో ఉంచారు..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + eight =