సూర్య‌, కాజ‌ల్… మ‌రోసారి?

2019 Latest Telugu Film News, Suriya and Kajal Aggarwal to Team Up Again, Kajal Aggarwal to Act With Surya again, Suriya and Kajal Aggarwal Latest Movie News, Suriya and Kajal Aggarwal Again Together, Kajal Aggarwal Ropped An Interesting Role In Surya Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చిన క‌థానాయికల్లో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఒక‌రు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు ఘ‌న‌విజ‌యాలు అందుకున్న ఈ టాలీవుడ్ చంద‌మామ‌… ఈ పంద్రాగస్టున తెలుగు చిత్రం ‘రణరంగం’తోనూ, తమిళ చిత్రం `కోమా-లి`తోనూ ప్రేక్షకులను అలరించింది. వీటిలో `కోమా-లి`తో మరో బ్లాక్ బ‌స్ట‌ర్‌ను తన ఖాతాలో వేసుకుంది కాజల్. కాగా… ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ నటించిన తాజా చిత్రం `పారిస్ పారిస్‌` పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా… `ఇండియ‌న్ 2` చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే… తాజాగా కాజ‌ల్ మరో కోలీవుడ్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

ఆ వివరాల్లోకి వెళితే… కోలీవుడ్ స్టార్‌ సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సూర్యకి జోడీగా కాజల్‌ను ఎంపిక చేసినట్టు కోలీవుడ్ టాక్. ఇది వ‌ర‌కు సూర్య‌, కాజ‌ల్ జంట‌గా ‘మాట్రాన్’(తెలుగులో ‘బ్రదర్స్’)(2012)లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. మళ్ళీ ఏడేళ్ళ తరువాత ఈ ఇద్ద‌రూ జ‌ట్టుక‌ట్ట‌నుండ‌డం విశేషం. ఏదేమైనా, కాజల్ ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here