సాహో మూవీ మోడల్ సిటీ సెట్ విశేషాలు

2019 Latest Telugu Film News, Saaho Movie Model City Set Highlights, Highlights of Model City Set in saaho, Saaho movie Latest News, Saaho Movie, Model City Set In saaho, Check out the futuristic city built from scratch for Prabhas, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News

యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఇండియా తోపాటు ఆస్ట్రియా, అబుధాబి, ఇటలీ లో చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. సాహో మూవీ లో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ రూపొందించిన యాక్షన్ సీన్స్ హై లైట్ గా నిలుస్తాయి. నేషనల్ అవార్డు విన్నర్ సాబు సిరిల్ , అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్ సౌమ్య చక్రవర్తుల స్పెషల్ ఎఫెక్ట్స్ కు అనువుగా ఒక మోడల్ సిటీ సెట్ ను వాజి పేరుతో రామోజీ ఫిలిం సిటీ లో రూపొందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాహో మూవీ కై ఒక సంవత్సరంలో 100సెట్స్ కు పైగా రూపొందాయని, రామోజీ ఫిల్మ్ సిటీ లో మోడల్ సిటీ సెట్ కు డిజైనర్స్ రోజుకు 12 నుండి 15 గంటలు పని చేశారని, ఆర్ట్ డిపార్టు మెంట్ 50, 60 మంది పనిచేసేవారనీ దర్శకుడు సుజీత్ తెలిపారు. వాజి గురించి తెలుసుకుందాం. అధికార ప్రతినిధుల ఆంతరంగిక సమావేశాలకై బాదాస్ సిటీ లో గోల్డెన్ డోమ్ నిర్మించారు. దర్శకుడు, ఆర్ట్ డిపార్ట్ మెంట్ పర్యవేక్షణలో గోల్డెన్ డోమ్ మోడల్ ను సెట్ లో VFX టీమ్ అద్భుతంగా ఆవిష్కరించారు.

ఒక ట్రక్ రోడ్డుపై కార్లను ఢీకొంటూ విధ్వంసం చేసే యాక్షన్ సీన్ ను కెన్నీ బేట్స్ ప్లాన్ చేశారు. 12mm స్టీల్, మట్టితో బంపర్, బాడీ ఫైబర్ తో బాడీ, బ్లాక్ పెయింట్ తో 15 రోజులలో అబుధాబి లో రూపొందించి ఆ సీన్ ను చిత్రీకరించారు. మూవీ లో ఒక భారీ ట్రక్ కార్లను ఢీకొని విధ్వంసం చేసినట్టుగా కనపడుతుంది.ఈ మూవీ లో ప్రభాస్, శ్రద్ధాకపూర్ రియల్ గన్స్ ఉపయోగించారు. మిగతా ఆయుధసామాగ్రి ఆర్ట్ స్టోర్ నుండి తెచ్చారు. 3D టెక్నిక్ తో ఒక గన్ ను రూపొందించారు. స్మోక్ బాంబ్స్, గ్రనేడ్స్ E వేస్ట్ , ప్లాస్టిక్, గ్లాస్, ఫైబర్, పేపర్, కార్డ్ బోర్డ్ లతో తయారు చేసి ఉపయోగించారు. ప్రతీ రోజు 60 మంది ఆర్ట్ డిపార్ట్ మెంట్ వ్యక్తులు పనిచేయడం విశేషం. విలన్స్ మీటింగ్ జరిపే బోర్డ్ రూమ్ ను యాక్టర్స్ పెర్సనాలిటీస్ కు తగ్గట్టుగా కలర్స్ తో రూపొందించారు. టెక్నో గాడ్జెట్స్ తో కార్లను, బైక్ ను రూపొందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 10 =