హవా తెలుగు మూవీ రివ్యూ

మహేష్ రెడ్డి దర్శకత్వంలో చైతన్య మాదాడి, దివి ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘హవా’. ఓ డిఫరెంట్ కథ తో టీజర్, ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ సినిమా. ఫిల్మ్‌ అండ్‌ రీల్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

నటీ నటులు : చైతన్య మాదాడి, దివి ప్రసన్న, స్టీఫెన్ మర్ఫీ, ఫోబ్ జాకోబర్, సందీప్ పగడాల, కమల్ కృష్ణ, జో జోసెఫ్, అంజా మేయెర్, ఆల్వోన్ జూనియర్, విలియమ్ ట్రాన్, శ్రీజిత్ గంగాధరన్ తదితరులు
దర్శకత్వం : మహేష్ రెడ్డి
బ్యానర్ : ఫిల్మ్ అండ్ రీల్
సంగీతం : గిఫ్టన్ ఎలియాస్
సినిమాటోగ్రఫీ : సంతోష్ షానమోని
ఎడిటర్ : కార్తిక శ్రీనివాస్

కథ:

బిజిలీ భాయ్ (కమల్ కృష్ణ) అనే గ్యాంగ్ స్టార్, చార్లీ (చైతన్య), తప్పన్ గ్యాంగ్ (సందీప్ పగడాల), హ్యారీ, దివి, అలెక్స్ (స్టీఫెన్ మర్ఫీ), ఫోబ్ జాకోబర్ (నటాషా) మొత్తం తొమ్మిది మంది… వీరందరూ ఒకరికి తెలియకుండా ఒకరు .. ఒకే ఇన్సిడెంట్ తో లింక్ అప్ అయి వుంటారు. కేవలం తొమ్మిది గంటల్లో వీరి జీవితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. మరి ఆ తొమ్మిదిమంది ఎవరు..? ఏం నేరాలు చేశారు.. ? ఆ నేరాలతో వారికి ఉన్న సంబంధం ఏంటీ? తొమ్మిదిగంటల్లోనే ఏం జరిగింది వాళ్ల లైఫ్ లో జరిగిన మార్పులేంటీ..? అనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం.. హారర్, థ్రిల్లర్ సినిమాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో మరో వినూత్న కథనంతో వచ్చింది హవా. 9గంటలు, 9బ్రెయిన్స్, 9 నేరాలు ఈ కాన్సెప్టే ప్రేక్షకుడిని థియేటర్ వరకు రప్పించింది అని చెప్పొచ్చు. అంటే సినిమా కేవలం 9 గంటల కాలంలో నడుస్తుందన్నమాట.

ఇక అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కథ. డైరెక్టర్ మహేష్ రెడ్డి మంచి థ్రిల్లింగ్ తో సాగే స్క్రీన్ ప్లే ని రాసుకున్నాడు. ఒక ఇన్సిడెంట్ కి మరో ఇన్సిడెంట్ కు లింక్ అప్ చేస్తూ ఆయన రాసుకున్న ట్విస్ట్స్ థ్రిల్లింగ్ కు గురిచేస్తాయి. మొదట కొంచెం కన్ఫ్యూజింగ్ గా వున్నా కథ నడుస్తున్న కొద్దీ.. ఒక్కొక్క పాత్రకు.. మరొక పాత్రకు వున్న కనెక్షన్ రివీల్ చేసే విధానం.. ఆ ట్విస్టులతో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసిన విధానం చాలా బావుంటుంది. మొదటి సినిమా అయినా మంచి అనుభవం వున్న డైరెక్టర్ లాగానే సినిమాను తెరకెక్కించాడు.

ఇక ఈ సినిమాకు మరో హైలైట్ సినిమాటోగ్రఫీ. నిజానికి సినిమా అంతా ఆస్ట్రేలియాలోనే షూట్ చేశారు. దాంతో అక్కడున్న అందమైన లోకేషన్స్ ను ఇంకా అందంగా చూపించాడు సంతోష్. ప్రతి ఒక్క ఫ్రేమ్ చూడటానికి చాలా అందంగా ఉంది. అంతే కాదు పూర్తిగా ఆస్ట్రేలియాలోనే చిత్రీకరించిన తొలి తెలుగు తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. గిప్టన్ ఎలియాస్ మంచి మ్యూజిక్ అందిచాడు.

ఓవరాల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లు ఈ సినిమా నచ్చుతుందని చెప్పొచ్చు.

Hawaa Telugu Movie Review
  • Story
  • Screen Play
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here