న‌వ‌త‌రం ‘మిస్సమ్మ’… భూమిక‌

#HBDBhumika, Happy Birthday Bhumika Chawla, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Telugu FilmNagar Wishes Actress Bhumika A Very Happy Birthday, Tollywood Cinema Updates, Wishing Bhumika Chawla A Very Happy Birthday, Wishing Tollywood Actress Bhumika Chawla A Very Happy Birthday
Telugu FilmNagar Wishes Actress Bhumika A Very Happy Birthday

భూమిక చావ్లా… న‌వ‌త‌రం `మిస్స‌మ్మ‌`. త‌న అందం, అభిన‌యంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను `ఖుషి` చేసిన ఈ స్మైలింగ్ బ్యూటీ పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భంగా… సినీ వినీలాకాశంలో భూమిక సాగిన తీరుని గుర్తు చేసుకుందాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

`సెవెన్త్ వండ‌ర్స్‌` హీరోయిన్‌:

సుమంత్ హీరోగా న‌టించిన‌ ‘యువకుడు’(2000)తో క‌థానాయిక‌గా తొలి అడుగులు వేసిన భూమిక‌… పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’(2001)తో తొలి విజ‌యాన్ని అందుకుంది. ఆపై ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో నాయిక‌గా అల‌రించింది. ముఖ్యంగా… పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, యన్టీఆర్ కెరీర్‌లో ఏడో చిత్రాలైన `ఖుషి`, `ఒక్క‌డు`, `సింహాద్రి`లో కథానాయికగా భూమిక న‌టించ‌డం… ఆ యా సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో… `సెవెన్త్ వండ‌ర్స్‌` నాయిక‌గా పేరు తెచ్చుకుందీ అందాల తార‌.

సీనియ‌ర్స్ ప‌క్క‌న క‌వ్వించిన భూమిక‌:

ఒక‌వైపు యువ క‌థానాయ‌కుల‌తో జ‌ట్టు క‌డుతూనే… మరోవైపు సీనియ‌ర్‌ అగ్ర కథానాయకులైన నాగార్జున(‘స్నేహమంటే ఇదేరా’), వెంకటేష్ (‘వాసు’), చిరంజీవి (‘జై చిరంజీవ’)స‌ర‌స‌న కూడా అల‌రించింది భూమిక‌. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ అప్‌క‌మింగ్ ఫిల్మ్‌లోనూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

కేరాఫ్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌:

ఒక‌వైపు స్టార్ హీరోల ప‌క్క‌న మురిపిస్తూనే… మ‌రోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ లోనూ త‌న‌దైన ముద్ర వేసింది భూమిక‌. ‘మిస్సమ్మ’, `స‌త్య‌భామ‌`. ‘అనసూయ’, `అమ‌రావ‌తి` వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో భూమిక విల‌క్ష‌ణ పాత్ర‌ల్లో అల‌రించింది. ఇక `మిస్స‌మ్మ‌`తో `ఉత్త‌మ న‌టి`గా `నంది` పుర‌స్కారాన్ని అందుకుంది.

ఇత‌ర భాష‌ల్లోనూ..:

కేవ‌లం తెలుగు చిత్రాల్లోనే కాదు.. ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లోనూ, హిందీలోనూ న‌టించింది భూమిక‌. తమిళంలో విజయ్, సూర్య… మలయాళంలో మోహన్ లాల్… హిందీలో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్ వంటి అగ్ర కథానాయకులతో స్క్రీన్ షేర్ చేసుకుంది భూమిక‌. అలాగే… కన్నడ, పంజాబీ, భోజ్‌పురి భాషల్లోనూ క‌నువిందు చేసింది.

సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ:

పెళ్ళ‌య్యాక కూడా క‌థానాయిక‌గా కొన‌సాగిన భూమిక‌… ఆ త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకుని క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ట‌ర్న్ అయ్యింది. `ఎంసీఏ`, `యూ ట‌ర్న్‌`, `స‌వ్య‌సాచి` చిత్రాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన భూమిక‌… మ‌రో వైపు వెబ్ సిరీస్‌లోనూ సంద‌డి చేస్తోంది.

మున్ముందు… ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ మ‌రిన్ని వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల్లో అల‌రిస్తూ ముందుకు సాగాల‌ని కోరుకుంటూ… జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది `ది తెలుగుఫిల్మ్‌న‌గ‌ర్‌.కామ్‌`.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =