మేమేమి తిని కూర్చోము – అలా అనుకుంటే వారి అమాయకత్వం

Nithya Menen Strong Counter to Social Media Trolls

‘అలా’ మొదలయింది సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్. సినిమా సినిమా కు వైవిద్యం చూపుతూ.. చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటూ తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. తనకు నచ్చని సినిమాల కు ఏ మాత్రం మొహమాటం లేకుండా నో చెప్పే వ్యక్తిత్యం నిత్యామీనన్ ది. కేవలం సినిమా విషయంలోనే కాదు… మిగిలిన విషయాల్లో కూడా తాను ఫేస్ టు ఫేస్ చెప్పేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎవరైనా లావుగా కనిపిస్తే వాళ్ళు తిని కూర్చోవడం వల్ల, బద్ధకం వల్ల లావైపోయుంటారని చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు. కొంతమంది విషయంలో అది కరెక్ట్ అవ్వొచ్చేమో కానీ.. నటుల విషయంలో అది ఏమాత్రం నిజం కాదు. మాకు ఎలాంటి బద్ధకం ఉండదు. హార్మోన్ల ప్రభావం వల్లో లేక ఇతర సమస్యల కారణంగానో ఒళ్లు వస్తుందే తప్ప మేం తిని కూర్చొని పొట్ట పెంచుకోవడం లేదు. అలా అనుకుంటే అది వారి అమాయకత్వం అని చెప్పింది. శరీరాకృతిపై సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అని తెలిపింది. మరి నిత్యా చెప్పడం వల్లైనా కామెంట్స్ తగ్గుతాయేమో చూద్దాం.

కాగా ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నిత్యా మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. ఇంకా జయలలిత బయోపిక్ తో పాటు మరో రెండు మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =