ప్రభాస్ సెట్ లోనే ప్రాక్టీస్ చేసేవాడు..!

2019 Latest Telugu Film News, Jacqueline Fernandez About Prabhas And Saaho Movie, Jacqueline Fernandez Comments on Prabhas, Prabhas Saaho Movie Latest News, Saaho new song Bad Boy, Jacqueline Fernandez Bad Boy Song in Saaho, Jacqueline Fernandez Words On Saaho, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Jacqueline Fernandez About Prabhas And Saaho Movie

సాహో నుండి రోజుకో అప్ డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే ‘సైకో సైయ్యా’ అంటూ ఒక క్లబ్ సాంగ్ వచ్చింది. ఆ తరవాత ఒక డ్యుయెట్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటివరకూ అప్ డేట్ ఇస్తూ రెండు పాటలను రిలీజ్ చేయగా.. ఎలాంటి అప్ డేట్ లేకుండా నిన్న మూడో పాటను రిలీజ్ చేశారు. బ్యాడ్ బాయ్ అనే పాటను రిలీస్ చేసి షాకిచ్చింది చిత్రయూనిట్. బ్యాడ్ బాయ్ పేరుతో విడుదలైన ఆ సాంగ్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడిపాడుతూ ప్రభాస్ నిజంగా బ్యాడ్ బాయ్ అనిపించాడు. సాంగ్ లో ప్రభాస్, బాలీవుడ్ భామ జాక్విలిన్ పెర్నాండెజ్ ఇద్దరూ స్టెప్పులతో అదరగొట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ పాటలో నటించిన జాక్విలిన్ ప్రభాస్ తో నటించినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రభాస్ తో నటించాలన్న కోరిక తీరిందని.. నాకు ఈ సాంగ్ ఆఫర్ వచ్చినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను.. ప్రభాస్ ఓ సూపర్ స్టార్.. ఈ పాటలో వున్న స్టెప్పులను ప్రభాస్ నాతో పాటు సెట్ లోనే ప్రాక్టీస్ చేసేవాడు.. తను అనుకున్నది పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకూ చేస్తూనే ఉంటాడని చెప్పుకొచ్చింది భామ. మరి కేవలం ఈ పాట వరకేనా.. ఇంకా కొంచం రోల్ ఏదైనా ఉందో చూడాలి.

కాగా సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తుండగా.. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, చుంకీ పాండే, లాల్, అరుణ్ విజయ్, మందిరా బేడీ, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మించింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 19 =