వాన్ డైక్ తరహాలో బాలకృష్ణ న్యూ లుక్

2019 Latest Telugu Film News, Balakrishna First Look From His Upcoming Movie Revealed, Balakrishna First Look From New movie, Balakrishna First Look, Balakrishna Latest Movie News, Balakrishna new look for KS Ravikumar film, Balakrishna And KS Ravikumar Movie Latest Updates, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Balakrishna First Look From His Upcoming Movie Revealed

సోషల్ మీడియా లో ప్రస్తుతం బాలకృష్ణ హల చల్ చేస్తున్నాడు. ఇంతకీ ఏ విషయం లో అనుకుంటున్నారా? బాలకృష్ణ అంటే బాలకృష్ణ ఫొటోస్ అన్నమాట.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ కు సంబంధించి ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రిమ్డ్ ఫ్రెంచ్ షేవ్ లో ఉన్న బాలయ్య ఫోటోని చూసిన అభిమానులు అవాక్కవ్వడంతో పాటు లైక్ ల మీద లైక్ లు కొడుతున్నారు. అసలు ఇటీవల నటించిన సినిమాల్లో బాలయ్య ఎప్పుడు ఇలాంటి లుక్ లో కనపడలేదు. వాన్ డైక్ తరహా గడ్డంతో బాలకృష్ణ సూటూబూటూ ధరించి కొత్త లుక్ తో ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా… ప్రస్తుతం ఈ సినిమా థాయ్‌లాండ్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. దీనిలో భాగంగానే అక్కడ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను పూర్తి చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా… సెప్టెంబర్ 6తో పూర్తి కానున్న ఈ లాంగ్ షెడ్యూల్‌లో… కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహన్ నటిస్తుండగా భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ త‌దిత‌రులు ఇతర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. హ్యాపీ మూవీస్ పతాకంపై సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =