మ‌ల్లూవుడ్‌లో మిల్కీ బ్యూటీ మెరుపులు

Tamannaah Bhatia Mollywood Debut with Central Jalile Pretham,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Tamannaah Bhatia Upcoming Movie News,Tamannaah Bhatia Next Film Updates,Tamannaah Bhatia New Movie News,#TamannaahBhatia
తమన్నా భాటియా… గ్లామ‌ర్ ప్రియులకు పరిచయం చేయ‌న‌క్క‌ర్లేని పేరు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మరాఠి భాషల్లో సంద‌డి చేసిన ఈ మిల్కీ బ్యూటీ… త్వ‌ర‌లో మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ట‌. అది కూడా ఓ హార‌ర్ మూవీతో. ఆ వివరాల్లోకి వెళితే… ‘సెంట్రల్ జైలిలే ప్రేతం’ (సెంట్రల్ జైల్‌లో దెయ్యం అని తెలుగు అర్థం) పేరుతో సంధ్య మీనన్ దర్శకత్వంలో ఓ మ‌ల‌యాళ చిత్రం తెర‌కెక్క‌నుంది. మ‌ల‌యాళ‌, త‌మిళ న‌టీన‌టులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించే ఈ హార‌ర్ మూవీలో తమన్నా మెయిన్ లీడ్‌గా ఎంపిక‌య్యింద‌ట‌. కాగా… ఇప్ప‌టివ‌ర‌కు అనువాద చిత్రాల‌ ద్వారా మాలీవుడ్ ప్రేక్షకులకు సుప‌రిచిత‌మైన ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఇప్పుడు స్ట్రెయిట్ పిక్చ‌ర్‌తో అక్కడి ఆడియన్స్‌ను అలరించనుండ‌డం విశేషమ‌నే చెప్పాలి. రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించి మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే… త‌మ‌న్నా తాజా చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` అక్టోబ‌ర్ 2న విడుద‌ల కానుంది.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=oWJLsV-eXNE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − three =