నెటిజెన్ కు మాధవన్ స్ట్రాంగ్ కౌంటర్ – నీ రెస్పెక్ట్ నాకు అవసరం లేదు

2019 Latest Telugu Film News, Actor Madhavan Strong Counter to Netizen, R Madhavan shuts down bigoted why a cross in prayer room, Actor Madhavan Reply To Netizen, Actor Madhavan Latest Movie News, Actor Madhavan Upcoming Movie projects, Troll slams Madhavan for keeping a cross in his house, R Madhavan Solid Reply to a Twitter User, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Actor Madhavan strong counter to netizen

సోషల్ మీడియా లో సెలబ్రిటీలపై నెటిజెన్ లు కామెంట్స్ చేయడం కామన్ థింగ్ అయిపోయింది. చిన్న పాయింట్ దొరికిందా ఆడేసుకుంటారు. మరి సెలబ్రిటీస్ ఏమన్నా తక్కువ.. కొంతమంది చూసీ చూడనట్టు వదిలేసినా.. కొంతమంది మాత్రం స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తుంటారు. ఇప్పుడు తాజాగా మాధవన్ కూడా ఓ నెటిజెన్ కు అలాంటి స్ట్రాంగ్ కౌంటర్ నే ఇచ్చాడు. ఇంతకు ఏ విషయంలో అనుకుంటున్నారా?

అసలు సంగతేంటంటే… ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే, రాఖీ పౌర్ణమి రెండు ఒకేరోజు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రాఖీ పౌర్ణమి సందర్భంగా సంప్రదాయ బట్టలలో తండ్రి కొడుకులతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఆ ఫోటోని బాగా గమనించిన ఓ నెటిజెన్ ” ఎక్కడైనా హిందువుల పూజా మందిరాలలో జీసస్ ఫోటోలు,సిలువలు ఉంటాయా, ఇదంతా సెట్ అప్, మీపైన నాకు రెస్పెక్ట్ పోయిందంటూ ఫోటోకి కామెంట్ పెట్టారు. అంతే ఈ కామెంట్ కు మాధవన్ సదరు నెటిజెన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. నీలాంటి భావాలు కలిగిన వారి రెస్పెక్ట్ నాకు అవసరం లేదు. నేను సర్వ మతాలను గౌరవిస్తాను, అన్ని మతాల దేవుళ్లను పూజిస్తాను, చర్చిలకు,మసీదులకు వెళతాను” అంటూ కౌంటర్ ఇచ్చారు.

కాగా మాధవన్ తాజాగా నటి అనుష్క తో కలిసి సైలెంట్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈఏడాది చివర్లో విడుదల చేసే యోచనలో వున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here