మంచు విష్ణు సోదరిగా స్టార్ హీరోయిన్?

Star Heroine Plays Sister Role to Manchu Vishnu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Kajal Aggarwal and Manchu Vishnu are Sister and Brother,Manchu Vishnu Upcoming Movie News,Manchu Vishnu Next Film Updates,Manchu Vishnu New Movie News

ప్రస్తుతం మంచు విష్ణు వరుస ప్లాప్స్ తో గడ్డు కాలంలోనే ఉన్నాడు. అందుకే ఈసారి పక్కా ప్లాన్ తో వస్తున్నాడు. ఒకేసారి నాలుగు ప్రాజెక్ట్ లతో వస్తున్నట్టు గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి శ్రీ కాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ కాగా మరొకటి కాజల్, విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా. మిగిలిన సినిమాల వివరాలు తెలియాల్సి వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విష్ణు ప్రధాన పాత్రలో హాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వం లో క్రైమ్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఇంగ్లీష్ తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అయితే ఇప్పుడు కాజల్ మంచు విష్ణు సోదరిగా నటించిననున్నట్లు సమాచారం. దీనికి కారణం నిన్న రాఖీ సందర్భంగా కాజల్‌ ట్విటర్‌లో ఓ ఫోటో షేర్ చేస్తూ… ‘హ్యాపీ రాఖీ అర్జున్‌!’ అంటూ మంచు విష్ణును ట్యాగ్‌ చేశారు. దీనికి విష్ణు ‘హాహాహా.. థాంక్స్‌ అను. చేతుల్లో ఫుడ్‌ లేకుండా మనం కలిసి ఉన్న ఒక్క ఫొటో కూడా లేదనుకుంటా’ అంటూ కాజల్‌ కు రిప్లై ఇచ్చాడు. దీన్ని బట్టి ఈ సినిమాలో విష్ణు అర్జున్‌ పాత్రలో, కాజల్‌ అను పాత్రలో అన్నా చెల్లెళ్లుగా నటిస్తున్నట్లు తెలుస్తుంది.

క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్నా చెల్లెల్ల పాత్రలు కీలకం కావటంతో స్టార్ హీరోయిన్ అయితేనే బావుంటుందని మంచు విష్ణు ఆమెను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరగుతోంది. త్వరలోనే సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు.

[subscribe]

[youtube_video videoid=zCzNEtv7DzE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 14 =