వారం గ్యాప్‌లో వ‌స్తున్న‌ `జెర్సీ` స్టార్స్

2019 Latest Telugu Film News, Nani And shraddha Srinath Are Gear Up For Jodi And Gang Leader Movie Releases, Gang Leader Movie Releases Date, Nani And shraddha Srinath Movies To Release On Same Date, Gang Leader Movie latest News, shraddha Srinath Are Gear Up For Jodi, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News
ఈ వేస‌వికి విడుద‌లై విజ‌యం సాధించిన ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామా`జెర్సీ’లో జంట‌గా న‌టించి అల‌రించారు నేచుర‌ల్ స్టార్ నాని, టాలెంటెడ్ బ్యూటీ శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌. క‌ట్ చేస్తే… ఈ ఇద్ద‌రూ ఇప్పుడు వారం రోజుల గ్యాప్‌లో త‌మ కొత్త చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నారు. అంతేకాదు… ఆయా సినిమాలు పాత చిత్రాల టైటిల్స్‌తో తెర‌కెక్కినవే కావ‌డం విశేషం. ఆ వివ‌రాల్లోకి వెళితే… `జెర్సీ` త‌రువాత శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ నాయిక‌గా న‌టించిన చిత్రం `జోడి`. ఆది సాయికుమార్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ సెప్టెంబ‌ర్ 6న విడుద‌ల కానుంది. 1999లో వ‌చ్చిన ప్ర‌శాంత్‌, సిమ్ర‌న్ స్టార‌ర్ `జోడి` టైటిల్‌ని రిపీట్ చేస్తూ తెర‌కెక్కిన ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇక `జోడి` విడుద‌లైన వారం రోజుల త‌రువాత అంటే సెప్టెంబ‌ర్ 13న నాని న‌టించిన `గ్యాంగ్ లీడ‌ర్‌` రిలీజ్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ `గ్యాంగ్ లీడ‌ర్‌`(1991) టైటిల్‌ని రిపీట్ చేస్తూ రూపొందిన ఈ రివెంజ్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌రి… వారం గ్యాప్‌లో ఈ వ‌స్తున్న ఈ చిత్రాల‌తో నాని, శ్ర‌ద్ధ ఏ స్థాయి విజ‌యాలు అందుకుంటారో చూడాలి.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=bCITH3-eaRs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =