యన్టీఆర్ ‘యమదొంగ’కు 12 ఏళ్ళు

#12YearsForYamadonga, Jr NTR Yamadonga Movie Completed 12 Years For Today, Jr NTR Yamadonga Movie Completes 12 Years, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Yamadonga Movie Updates, Yamadonga Telugu Movie Latest News
తెలుగునాట యంగ్ టైగర్ యన్టీఆర్‌, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిది సూప‌ర్ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌. ఇప్ప‌టికే ‘స్టూడెంట్ నెం.1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ రూపంలో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో… ప్ర‌స్తుతం మాసివ్ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్` రూపొందుతోంది. ఇదిలా ఉంటే… తార‌క్‌, జ‌క్క‌న్న కాంబినేష‌న్‌కి హ్యాట్రిక్ విజ‌యాన్ని అందించిన `య‌మ‌దొంగ‌` విడుద‌లై నేటికి 12 వ‌సంతాలు. ఈ సంద‌ర్భంగా ఆ సినిమా జ్ఞాప‌కాల్లోకి వెళితే… తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎవర్‌గ్రీన్ కాన్సెప్ట్ అయిన యముడు, యమలోకం నేపథ్యంలో… సోషియో ఫాంట‌సీ ఫిల్మ్‌గా తెర‌కెక్కిన `య‌మ‌దొంగ‌` అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ముఖ్యంగా… ఓ ప్ర‌త్యేక ఘ‌ట్టంలో వ‌చ్చే స‌న్నివేశాల్లో యంగ్ య‌మ‌గా తార‌క్ వేష‌ధార‌ణ‌, సంభాష‌ణ‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. అలాగే కెరీర్ ఆరంభం నుంచి బొద్దుగా క‌నిపిస్తూ వ‌చ్చిన‌ య‌న్టీఆర్‌… స్లిమ్ లుక్‌లో మెస్మ‌రైజ్ చేసిన తీరు కూడా చిత్ర విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది. అదేవిధంగా… నృత్యాల్లోనూ వేగం క‌నువిందు చేసింది. అంతేకాదు… `ఓల‌మ్మి తిక్క‌రేగిందా` పాట‌తో తార‌క్‌లోని గాయ‌కుడిని ప‌రిచ‌యం చేసిన సినిమాగానూ `య‌మ‌దొంగ‌` నిల‌చింది. య‌ముడిగా క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు న‌టించిన ఈ చిత్రంలో తార‌క్‌కి జోడీగా ప్రియమణి, మమత మోహన్ దాస్ నటించగా ఖుష్బూ, బ్రహ్మానందం, అలీ, రాజీవ్ కనకాల, ఎం.ఎస్.నారాయణ తదితరులు ఇతర ముఖ్య‌ పాత్రలు పోషించారు. రంభ, నవనీత్ కౌర్, ప్రీతి జాంగ్యాని, అర్చన ప్ర‌త్యేక గీతాల్లో మెరిసారు. ఎం.ఎం.కీరవాణి స్వరసారథ్యంలో “రబ్బరు గాజులు”, “యంగ్ య‌మ‌`, “నూనూగు మీసాలోడు”, “నాచోరే నాచోరే”, “నువ్వు ముట్టుకుంటే” గీతాలు విశేషాద‌ర‌ణ పొందాయి. విశ్వామిత్ర క్రియేషన్స్ పతాకంపై ఊర్మిళ గుణ్ణం, పి.చెర్రీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నాలుగు నంది అవార్డులతో పాటు ప‌లు ఇత‌ర‌ పురస్కారాలను కూడా కైవసం చేసుకుంది. 2007 ఆగస్టు 15న విడుదలైన ‘యమదొంగ’… నేటితో పుష్క‌ర‌కాలాన్ని పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=08G11NcTJDs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 10 =