బన్నీ, త్రివిక్రమ్ సినిమా టైటిల్ విడుదల

AA19 Title Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Ala Vaikunthapuramulo Movie Updates,Ala Vaikunthapuramulo Telugu Movie Latest News,Allu Arjun New Movie Title As Ala Vaikunthapuramulo,Ala Vaikunthapuramulo Title For Allu Arjun AA19

స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇది అల్లు అర్జున్‌కి 19వ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ముందు చెప్పినట్టే ఈ రోజు టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.  టైటిల్ తో పాటు ,ఫస్ట్ గ్లిమ్ప్స్ పేరుతో ఓ చిన్న టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. “అల,వైకుంఠపురంలో” అనే విభిన్నతతో కూడిన ఓ క్లాసిక్ టైటిల్, ఫిక్స్ చేశారు.
 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే బన్నీతో జతకట్టనుంది. ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలా… వైకుంఠ‌పురంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

[youtube_video videoid=hesTBbGRlaQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − four =