‘పాగల్’ గా వస్తున్న విశ్వక్ సేన్

2019 Latest Telugu Film News, Vishwak Sen Coming Up With Pagal Movie, Vishwak Sen Next Pagal, Vishwak Sen Latest Movie News, Vishwak Sen Ropped An Interesting Role, Vishwak Sen Next Titled As Pagal, Pagal Movie Shooting Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Vishwak Sen Coming Up With Pagal Movie

ఫలక్‌నమా దాస్‌తో సక్సెస్‌ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్నాడు. నరేష్ రెడ్డి కుప్పిలి అనే కొత్త దర్శకుడితో విశ్వక్ సేన్ హీరో గా ‘పాగల్’ అనే సినిమా తెరకెక్కబోతుంది. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాటా బిర్లా మధ్యలో లైలా, మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్తా మామా లాంటి సినిమాలు అందించిన లక్కీ మీడియా బ్యానర్, రీసెంట్ గా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ హుషారు తో మరో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే బ్యానర్ లో.. నిర్మాత బెక్కం వేణుగోపాల్. ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ సెకండ్ వీక్ నుండి మొదలుకానుంది.

ఈ సందర్బంగా నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ.. ‘ఫలక్ నమా దాస్ లాంటి సూపర్ హిట్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరో విశ్వక్ సేన్‌తో మా లక్కీ మీడియా బ్యానర్ నెక్ట్ ప్రాజెక్ట్ చేయడం హ్యాపీగా ఉంది. మా గత చిత్రం హుషారు సక్సెస్ మాకు మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి, కొత్త వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయడానికి మంచి ఉత్సాహన్నిచ్చిందని అన్నారు.

ఇక విశ్వక్ సేన్ గతంలో , ఫలక్ నుమా దాస్ తో పాటు, పెళ్లి చూపులు మూవీకి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన “ఈ నగరానికి ఏమైంది?” చిత్రంలో నటించారు.

[subscribe]

[youtube_video videoid=JxLXURcTA0k]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =