700 రోజుల్లో 70 రోజులు షూట్ చేశాం

2019 Latest Telugu Film News, Ranarangam Movie highlights revealed by Sharwanand, Ranarangam Movie highlights, Sharwanand Revealed Ranarangam Movie, Sharwanand About Ranarangam Movie, Ranarangam Movie Latest News, Sharwanand Starrer Ranarangam Movie Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Ranarangam Movie Highlights Revealed by Sharwanand

శర్వానంద్‌ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. కాజల్‌ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా రేపు విడుదల కానున్న సందర్భంగా సుధీర్‌ వర్మ ప్రెస్ మీట్లో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నాడు.

ఈ సినిమాకు ఇన్స్పిరేషన్ ఏంటి?

ఇన్స్పిరేషన్ అంటే స్క్రీన్ ప్లే ఫార్మేట్ అది గాడ్ ఫాదర్ 2 నుండి ఇన్స్పైర్ అయిందే.అంటే గ్యాంగ్ స్టర్ సినిమా చేస్తున్నాం అంటేనే ఫస్ట్ గాడ్ ఫాదర్ మూవీనే గుర్తొస్తుంది. అది అలా బెంచ్ మార్క్ పెట్టింది. కాబట్టి కచ్చితంగా దాని నుండి ప్రేరణ పొందుతాం. అయితే.. ఎంత వరకు సక్సెస్ అయ్యాం అనేది మూవీ ఫలితం తరువాత తెలుస్తోంది.

‘రణరంగం’ సినిమాకు శర్వానంద్ నే ఎంచుకోవడానికి కారణం ?

శర్వా సినిమాల్లో నాకు ప్రస్థానం బాగా ఇష్టం. సో ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నప్పుడు.. ఏం చేసినా కొంచం ఇంటెన్సిటీ వున్న పాత్రే చేద్దామనుకున్నాం. అలా ఇది స్ట్రైక్ అయింది. అంటే తను చేసిన ఫ్యామిలీ, లవ్ స్టోరీ టైపు సినిమాలు హిట్ అయ్యాయి కానీ.. నాకు ఎప్పుడు అలాంటిది చేద్దామన్న ఆలోచన లేదు.

40 ప్లస్ వయసు వున్న పాత్రలో నటించడానికి శర్వాను ఎలా కన్విన్స్ చేశారు?

నేను కన్విన్స్ అవ్వడం కాదు.. శర్వా నన్ను కన్విన్స్ చేశాడు. మొదట ఈ సినిమా రవితేజ తో అనుకున్నా.. అప్పటికే ఆయన రెండు సినిమాలతో బిజీ గా వున్నాడు… అయితే నేను శర్వా వేరే సబ్జెక్టు అనుకున్నాం.. దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఓ రోజు టాపిక్ లో అనుకోకుండా ఈ సినిమా లైన్ గురించి చెప్పా.. రవితేజ తో చేస్తున్నా అని చెప్పా. ఆ తర్వాత ఒక వారానికి మనం ఆ సినిమా చేద్దాం నాకు ఛాలెంజింగా ఉంటది అలా చేయడం.. రవితేజ గారిని మీరే ఎలాగైనా కన్విన్స్ చేయండి అని అనడంతో.. అప్పుడు నేను కొంచం ఆలోచించి లుక్ టెస్ట్ అన్నీ చేసి ఓకే శర్వా సూట్ అయ్యాడని స్టార్ట్ చేశాం.

గ్యాంగ్ స్టర్ సినిమాలు చాలా వచ్చాయి కదా? ఈ సినిమాలో స్పెషల్ ఏంటి?

స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటది.. నేను తీసుకున్న బ్యాక్ డ్రాప్. అంటే ఎన్టీ రామారావుగారు ఎప్పుడైతే 1994 లో రెండో సారి సీఎం అయినప్పుడు.. మొదటి సంతకం ప్రొహిబిషన్ దానిపై పెట్టారు. ఆ తర్వాత రెండేళ్లకు చంద్రబాబు గారు వచ్చినతర్వాత అది రద్దు చేశారు. ఆ రెండు సంవత్సరాల ప్రొహిబిషన్ ఏదయితే ఉందో ఆ బ్యాక్ డ్రాప్ తీసుకొని చేశా. ఇప్పటివరకు తెలుగులో ఆ బ్యాక్ డ్రాప్ మీద తెలుగులో ఎవరూ చేయలేదు.

షారుక్ ఖాన్ సినిమా ‘రాయీస్‌’ కూడా సేమ్ ప్లాట్ కదా?

ప్లాట్ పరంగా ప్రొహిబిషన్ కరెక్టే కానీ.. దాని నుండి తీసుకుంది ఏంలేదు. చెప్పాలంటే నేను అసలు రాయీస్‌ సినిమా చూడలేదు. మా వాళ్ళు సేమ్ ఉంటదని చెబితే చూశాను. నేను ఏదైనా తీసుకుంటే ఓపెన్ గా చెప్పేస్తాను.

దళపతి.. రణరంగం అయిందని వార్తలు వస్తున్నాయి నిజమేనా?

నిజానికి దళపతి అని కూడా అనుకున్నాం.. కానీ అది వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయింది.. ఆ సినిమా కూడా రిలీజ్ కొచ్చింది.

త్రివిక్రమ్ గారికి సినిమా ముందే చూపించారు.. అడ్వైజెస్ ఏమైనా తీసుకోడానికి చూపించారా?

త్రివిక్రమ్‌గారు సినిమా చూశారు. బావుందని మెచ్చుకున్నారు. సినిమా చుసిన తర్వాత నేను మార్చడానికి ఏముంటది… రిలీజ్ అయ్యే సినిమా చూసారు ఆయన.. చాలా బావుందని చెప్పారు.

ఇంత వరకు మీరు పూర్తి ప్రేమ కథతో సినిమా తీయలేదు. ఈ సినిమాతో సుధీర్ వర్మ ప్రేమ కథలు కూడా తీయగలడని అనుకోవచ్చా?

అంటే ఈ సినిమాలో శర్వా, కళ్యాణి ట్రాక్ చూసినప్పుడు నాకు కొంచెం ఫీలింగ్ వచ్చింది. ఏమైనా ట్రై చేయొచ్చేమో…తీయగలవేమో అని..అయితే నేను ఫుల్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు అందులోకి దిగను.. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఫుల్ డబ్బు పెడతాడు.. హీరో ఇమేజ్, కెరీర్ అన్నీ ఉంటాయి.. మనకి వచ్చా? రాదా? అని టెస్ట్ చేసుకోడానికి అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. నేను ఇది చేయగలను అనుకుంటే అది చేస్తాను.

ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే పెరిగిందట ?

నిర్మాత నాగవంశీగారికి సినిమా అవుట్ ఫుట్ ముఖ్యం. ఎక్కడా క్వాలిటీ తగ్గుకుండా సినిమా చేయమని చెప్పారు. ఆ క్రమంలో ముందు అనుకున్నదాని కంటే బడ్జెట్ పెరిగింది. నా కెరీర్‌ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమా. వాస్తవానికి ఇప్పటివరకూ నాగవంశీగారు నాకు బడ్జెట్ ఎంత అవుతుందో చెప్పలేదు. ఆయనకి బడ్జెట్ కంటే కూడా సినిమా క్వాలిటీ మాత్రమే ముఖ్యం.

‘గ్యాంగ్ స్టర్’గా శర్వానంద్ ఎలా చేసాడు ?

సినిమాలో శర్వానంద్ అచ్చం ‘గ్యాంగ్ స్టర్’లానే కనిపిస్తాడు. అంతబాగా తను ఆ రోల్ ను ఓన్ చేసుకుని చేశాడు. ‘రణరంగం’లోని శర్వా క్యారెక్టర్ లో రెండు షేడ్స్ ఉంటాయి. ఆ రెండు షేడ్స్ ను ఆయన బాగా పలికించారు.

ఒక ఫిలిం మేకర్ గా ఈ సినిమా ఎలా ఛాలెంజింగ్ గా అనిపించింది?

నేను తీసిన అన్ని సినిమాల్లో ఇది చాలా ఛాలెంజింగ్.. కెమెరా, మ్యూజిక్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అన్నీ హ్యాండిల్ చేయాలి.. అప్పటి వాతావరణాన్ని చూపించాలంటే చాలా కష్టం.. పీరియాడిక్ స్టోరీ కాబట్టి అప్పటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. ఫోన్ వాడకుండా ఇప్పటి వస్తువులు కనబడకుండా చాలా జాగ్రత్త తీసుకున్నాం. ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చేయలేక అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేసి చేసాం.

‘గ్యాంగ్ స్టర్’కి సీక్వెల్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నిజమేనా ?

నిన్నే శర్వా ఓ ఐడియా చెప్పాడు. ఇది మనకి బావుంటే ఇలా చేయొచ్చేమో అని. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. రణరంగం సినిమా సక్సెస్ ఐన తర్వాత చుద్దాం. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే క్యాష్ చేసుకోడానికి ఉంటాయి.. నన్ను చాలా మంది స్వామిరారా2 కూడా చేయమన్నారు.. నాకు ఏదన్నా ఫస్ట్ ఏదో కస్టపడి చేశాం.. వర్కౌట్ అయింది.. దానికన్నా మంచి ఐడియా వుంది అంటే చేయాలి. స్వామిరారా సినిమాకు ముందు సుధీర్ అంటే ఎవరికీ తెలీదు.. నిఖిల్ కూడా బ్యాడ్ ఫేజ్ లో వున్నాడు.. ప్రొడ్యూసర్ కూడా తెలియదు .. అందరూ కొత్త వాళ్ళు.. అంచనాలు లేకుండా వచ్చి సక్సెస్ అయింది. ఇప్పుడు టూ చేస్తున్నామంటే కొద్దో గొప్పో స్వామిరారా తెలుసుకాబట్టి అంచనాలు ఉంటాయి. అది రీచ్ అయ్యేలా ఉంటేనే అట్టెంప్ట్ చేయాలి. అటువంటి ఐడియా వస్తేనే రణరంగం సీక్వెల్ చేస్తా.

మేకింగ్ కు రెండు సంవత్సరాల టైం పట్టడానికి కారణం ఏంటి?

టూ ఇయర్స్ పట్టడానికి అంటే.. ఈ సినిమా స్టార్ట్ అయింది 2018 ఏప్రిల్ లో.. ఒక సంవత్సరం మేకింగ్ కు పట్టింది.. బట్ ఇంత టైం పట్టడానికి కారణం ఏంటంటే.. నిజానికి నేను డిసెంబర్ నుండి స్టార్ట్ చేద్దామనుకున్న కానీ అప్పటి వాతావరణానికి ఇప్పుడు లొకేషన్స్ లో వర్క్ అవుట్ అవ్వకపోవడం తో సెట్ వేయాల్సి వచ్చింది దానికి కొంచం టైం పట్టింది.. ఈ లోపు శర్వా పడి పడి లేచె మనసు సినిమా స్టార్ట్ అయింది. అందులోనూ పడి పడి లేచె మనసు గెటప్ కి ఈ సినిమాలో గెటప్ కి కొన్ని సిమిలారిటీస్ వున్నాయి.. సో ఆ సినిమా ఐపోయిన తర్వాతే నేను ఈ సినిమా చేయాల్సి వచ్చింది. 700 డేస్ కి 75 డేస్ షూట్ చేశాం. అంతే తప్ప ఇంకేం లేదు.

మీ తదుపరి సినిమా ఏమిటి ?

సితార బ్యానర్‌ లోనే నా తదుపరి సినిమా ఉంటుంది. రణరంగం చేస్తున్నప్పుడే నాగవంశీగారు మరో సినిమా చేయమని అడిగారు. ప్రస్తుతానికి అయితే ‘రణరంగం’ సినిమా రిలీజ్ కోసమే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ‘రణరంగం’ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here