ఈ వారం ‘రణరంగం’ లో గెలుపు ‘ఎవరు’ ది?

2019 Telugu Full Movies, Ranarangam And Evaru all set for tomorrow release, Ranarangam And Evaru Ready For Release, Ranarangam Movie Latest news, Ranarangam And Evaru Release Updates, Tomorrow Releasing Movies Ranarangam And Evaru, Sharwanand Starrer Ranarangam Releasing Tomorrow, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Ranarangam And Evaru all Set For Tomorrow Release

నిజానికి రేపు సాహో రిలీజ్ అవ్వాలి. కానీ ఇంకా కొన్ని కార్యక్రమాలు పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ కాస్త ఆగష్ట్ 30 కు వెళ్ళింది. ఇక ఒక్క సాహో రిలీజ్ డేట్ పై చాలా సినిమాలా రిలీజ్ డేట్లు ఆధారపడటంతో… సాహో దెబ్బకి మళ్ళీ రిలీజ్ డేట్లు మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రణరంగం, ఎవరు సినిమాలు ఆగష్ట్ 15కు వచ్చాయి. వాల్మీకి, గ్యాంగ్ లీడర్ సినిమాలు సినిమాలు సెప్టెంబర్ కు వెళ్లిపోయాయి. ఇక రేపు ఇండిపెండెన్స్ కి రణరంగం, ఎవరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొదటినుండి శర్వా కాస్త విభిన్నమైన సినిమాలనే చేసుకుంటూ తన నటనలో అన్ని కోణాలను చూపించడానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. అలాంటి సినిమానే ‘రణరంగం’ కూడా. ఫస్ట్ లుక్ తోనే మంచి వైబ్ క్రియేట్ చేసింది. తర్వాత వచ్చిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక శర్వా కి ఎలాంటి సీరియస్ అండ్ సెటిల్డ్ క్యారెక్టర్స్ బాగా సూట్ అవుతాయి కాబట్టి.. ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ఇప్పుడు శర్వానంద్ కూడా ఒక మంచి హిట్ కావాలి. పడి పడి లేచే మనసు సినిమాకి మంచి టాక్ వచ్చినా హిట్ మాత్రం అందలేదు. ఇప్పుడు రణరంగం తో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.

మరోపక్క అడివి శేష్ వరుస హిట్లతో మంచి ఫామ్ లో వున్నాడు. ఇప్పుడొస్తున్న తను హిట్లు కొట్టిన క్షణం, గూడచారి సినిమాలు కూడా సస్పెన్స్ థ్రిల్లర్ కు సంబంధించినవే. ఎవరు కూడా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కి సంబంధించిందే. దాంతో ఎవరు పై కూడా మంచి అంచనాలు వున్నాయి. దానికితోడు.. టీజర్ కు, ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడం తో ఆ అంచనాలు ఇంకా ఎక్కువయ్యాయి. అన్నిటికంటే అడివి శేష్ మంచి కథలను ఎంచుకుంటాడంటే నమ్మకమే ఈ సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది.

ఇద్దరు హీరోలు వైవిధ్యం కోరుకునేవాళ్లే.. రెండు సినిమాలు భిన్నమైన సినిమాలే.. మరి భారీ అంచనాల మధ్య ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో.. ఈ రెండు సినిమాల్లో బాక్సాఫీస్ రణరంగం లో హిట్ కొట్టేది ఎవరు అనేది తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.

[subscribe]


[youtube_video videoid=TfW6lil5uyc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =