నాని గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి

2019 Latest Telugu Film News, Prabhas to attend as chief guest for Nani's Gang Leader Pre Release Event,Prabhas to attend as chief guest For Gang Leader Pre Release, Gang Leader Pre Release Event Updates, Gang Leader Movie Latest News, Gang Leader Pre Release Event guest As Prabhas, Nani Gang Leader, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గ్యాంగ్ లీడర్ మూవీ సెప్టెంబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కార్తికేయ నెగటివ్ రోల్ లో నటించడం విశేషం. లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రఘు బాబు ముఖ్య పాత్రలలో నటించారు. PC శ్రీరామ్ ఛాయాగ్రహణం, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఫస్ట్ లుక్, టీజర్ తో ఆకట్టుకున్న గ్యాంగ్ లీడర్ మూవీ పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందిన సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. నాని గ్యాంగ్ లీడర్ ఆగస్ట్ 30వ తేదీ రిలీజ్ కావాల్సింది, సాహో రిలీజ్ కారణం గా సెప్టెంబర్ 13 వ తేదీ కి పోస్టుపోన్ అయింది. సాహో మూవీ సోలో రిలీజ్ కు సహకరించిన హీరో నాని అతని టీమ్ విషయంలో ప్రభాస్ హ్యాపీ ఫీలయ్యారు. తాజా సమాచారం ప్రకారం గ్యాంగ్ లీడర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ ముఖ్య అతిథి గా పాల్గొంటారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=5nukYeorPLw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 14 =