బ‌న్నీ, త్రివిక్ర‌మ్ చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

2019 Latest Telugu Film News, Ala Vaikunta Puram Title in Consideration for Allu Arjun and Trivikram Film,Allu Arjun and Trivikram Film New Movie Gets A Title, Allu Arjun and Trivikram Film Latest News, Ala Vaikunta Puram Movie, Ala Vaikunta Puram Movie Latest News, Ala Vaikunta Puram Allu Arjun New movie Title, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య భూమిక‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ మెరుపు వేగంతో సాగుతోంది. ఇదిలా ఉంటే… అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంద‌ని స‌మాచారం. అంతేకాదు… బలరామ కృష్ణుల కథను ఆధునికంగా అల్లుకుని త్రివిక్ర‌మ్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడ‌ని టాక్‌. ఈ నేప‌థ్యంలోనే… పోతన భాగవతంలో బాగా ప్రాచుర్యం పొందిన “గజేంద్రమోక్షం” పద్యంలో వచ్చే ‘అలా… వైకుంఠ‌పురంలో’ అనే పదాలనే ఈ సినిమా టైటిల్‌గా ఆల్మోస్ట్ ఫైనల్ చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా… ఆగ‌స్టు 15న బ‌న్నీ-త్రివిక్ర‌మ్ హ్యాట్రిక్ మూవీ టైటిల్‌పై అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌స్తుంది కాబ‌ట్టి… అప్ప‌టివ‌ర‌కు వేచి చూడాల్సిందే. థ‌మన్ సంగీతం అందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here