రోజుకో సర్ ప్రైజ్ తో సాహో టీం ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టిన దగ్గరనుండి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే వుంది. ఇప్పటికే టీజర్, పాటలు, యాక్షన్ పోస్టర్స్, రెండు రోజుల క్రితం ట్రయిలర్ ను రిలీజ్ చేసింది. ఇంకా ఆ ట్రైలర్ మూడ్ లో నుండి ఇంకా బయటకు రాకముందే… మళ్ళీ ఓ సర్ ప్రైజ్ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘సాహో ది గేమ్’ పేరుతో ఓ వీడియో గేమ్ ని విడుదల చేస్తున్నట్లుగా ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా ఇటీవల తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ గేమ్ ని పబ్జీ లాంటి గేమ్ ను డిజైన్ చేసిన ప్రఖ్యాత గేమ్ డెవలపింగ్ సంస్థ ఫిక్స లాట్ ల్యాబ్స్ డెవలప్ చేయడం జరిగింది. ఇక తాజా అప్డేట్ ఏంటంటే.. ఈ వీడియో గేమ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి చూసేయండి.
[youtube_video videoid=8KwZW-wH0PI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: