రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ దర్శకత్వం లో తెరకెక్కిన భారీ యాక్షన్ కమ్ భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’. ఇక ఈ సినిమా ట్రైలర్ ను మొన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ట్రైలర్ ఇలా విడుదల అయ్యిందో లేదో అప్పుడే యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. నెంబర్ వన్‌లో ట్రెండింగ్ అవుతూ 70 మిలియన్ వ్యూస్‌కు పైగా సాధించి పాత రికార్డులు తుడిచేసి.. కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ఇంత వరకూ ఇండియన్ స్క్రీన్ పై కనిపించలేదంటే… అతిశయోక్తి కాదు. యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక ప్రభాస్ చెప్పిన ‘గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టే వాడికే ఒక రేంజ్ ఉంటుది’.. అనే డైలాగ్ అయితే ఒక రేంజ్లో ఉంది. 2 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్లో అన్ని ఎమోషన్స్ మిక్స్ చేశాడు దర్శకుడు సుజీత్. దుబాయ్, రొమేనియా లో తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్లో హైలైట్ అయ్యాయి. ఈ సినిమా కోసం విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేశారు. ఇక ట్రైలర్ ను చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థంచేసుకోవచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
* ఇక ఈ ట్రైలర్ బట్టి చూస్తుంటే సినిమాలో ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు వున్నట్టు తెలుస్తుంది.. ఒకపక్క భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండటం తో పాటు.. మరో పక్క లవ్ ట్రాక్.. అదే క్రమంలో ఎమోషన్.. ఇవన్నీ ఎక్కడా తక్కువ కాకుండా చూసుకున్నాడు సుజిత్.
* ఇక ప్రభాస్ లాంటి హీరో దొరికితే డైరెక్టర్ కు పండగే కదా.. అందుకే యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో పెట్టాడు. భూమి మీదే కాదు గాల్లో కూడా మన ప్రభాస్ తో తనకు కావాల్సినట్టు చేయించుకున్నాడు. దర్శకుడిగా సుజిత్ టేకింగ్, ఫోటోగ్రఫీ, ప్రభాస్ స్టంట్స్ ఓ రేంజ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు.
* ఈ సినిమా లో మరో అద్భుత సృష్టి ఏంటంటే.. కాస్ట్లీయెస్ట్ ‘వాజీ సిటీ’ ని క్రియేట్ చేయడం. ఇంత వరకు ఏ సినిమాలో వినిపించని పేరు ఇది. ఈ ఫిక్షనల్ సిటీ ని ‘సబు సెరిల్’ చాలా అద్భుతం గా సృష్టించాడు.
* ప్రభాస్, శ్రద్ధల కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. వీరి మధ్య వచ్చే సీన్స్ నిజంగానే సాహో అనిపిస్తాయి. వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది.
* మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే.. ఈ సినిమాలో విలన్స్. బేసిక్ గా ఒక్క సాలిడ్ విలన్ ఉంటేనే ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటిది..ఒకేసారి నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, లాల్, మహేష్ మంజ్రేకర్ ఇంత మంది విలన్స్ స్క్రీన్ పై ఉంటే ఎలా ఉంటది.. ఆ ఊహే అంతకుమించి అన్నట్టు లేదు.
* ఇక ఈ సినిమాకు మది సినిమాటోగ్రఫీ, జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి అని చెప్పొచ్చు.
మరి ఇవన్నీ చూసిన తర్వాత బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లిన ప్రభాస్.. మరోసారి తానే సాహో సినిమాతో ఇండియన్ సినిమాలో మరో కొత్త అధ్యయనం సృష్టిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు కదా.
[subscribe]
[youtube_video videoid=HNnt00swZ5Q]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: