60 ఇయర్స్ సక్సెస్ ఫుల్ సినీ జర్నీ

2019 Latest Telugu Film News, Kamal Haasan completes 60 years in Indian Cinema,Kamal Haasan 60 years Completed in Indian Cinema, Kamal Haasan clocks 60 years in Indian Cinema, Kamal Haasan Latest Movie News, 60 Glorified Years For Kamal Hassan In Indian Cinemas, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

లెజండరీ యాక్టర్, డాన్సర్, రైటర్, సింగర్, లిరిసిస్ట్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, పొలిటీషియన్ కమల్ హాసన్ చిత్ర పరిశ్రమలో 60 సంవత్సరాల సక్సెస్ ఫుల్ జర్నీసందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కమల్ హాసన్ పై ప్రశంసలు కురిపించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషలలో 200 మూవీస్ కు పైగా నటించిన కమల్ హాసన్ కలైమామణి, పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి అత్యుత్తమ పురస్కారాలు అందుకున్నారు. బెస్ట్ యాక్టర్ గా 19 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకొనడం విశేషం. 1960 సంవత్సరం కలత్తూర్ కన్నమ్మ మూవీతో బాలనటుడు గా కోలీవుడ్ కు పరిచయమైన కమల్ హాసన్ ఆ మూవీ లో పెర్ఫార్మెన్స్ కు ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ అందుకున్నారు.

సూపర్ హిట్ మూవీ అపూర్వ రాగంగళ్ లో హీరోగా నటించి కమల్ సక్సెస్ ఫుల్ హీరోగా మారారు. మరోచరిత్ర, సాగర సంగమం, స్వాతి ముత్యం, నాయకన్, అపూర్వ సహోదర్ గళ్, మైకేల్ మదనకామరాజన్, సతి లీలావతి, ఇండియన్, అవ్వై షణ్ముఖి, వేట్టైయాడువిలైయాడు, దశావతారం, ఉన్నైపోల వరువన్, విశ్వరూపం, ఏక్ ధూజే కేలియే, సనమ్ తేరీ కసమ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కమల్ హాసన్ సినీకెరీర్ లో మైలురాళ్ళుగా నిలిచాయి. 60 సంవత్సరాల సినీ జర్నీ లో మీరు ఉన్నందుకు గర్వం గా ఉందని, మీరు నటించిన సినిమాలు ప్రేరణ నిచ్చాయని, డెడికేషన్ తో మీ టైమ్, ఎనర్జీ కళామతల్లి సేవలకై వినియోగించినందుకు గర్వపడుతున్నామని కమల్ తనయ శ్రుతి హాసన్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా కమల్ హాసన్ కు అభినందనలు తెలిపారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here