‘సాహో’లో ప్ర‌భాస్ పాత్ర పేరు అదేనా?

2019 Latest Telugu Film News, Prabhas As Ashoka Chakravarthy in Saaho, Prabhas Role In Saaho , Saaho movie Latest News, Ashoka Chakravarthy Role In saaho Movie, Ashoka Chakravarthy Role by Prabhas,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

“గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టినోడికే ఓ రేంజ్ ఉంటుంది” అంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రంతో సిక్స్(బ్లాక్‌బ‌స్ట‌ర్‌) కొట్టడానికి సిద్ధపడుతున్నాడు. ప్రభాస్ హీరోగా సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన‌ ట్రైలర్‌ శ‌నివారం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ ట్రైలర్… ‘సాహో’ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అవేమిటంటే… ఈ చిత్రంలో ప్రభాస్ ఓ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా న‌టించిన‌ట్టు ట్రైల‌ర్ చూస్తే తెలుస్తోంది. అలాగే… ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు “అశోక చక్రవర్తి” అని ట్రైలర్‌ను నిశితంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇంట్రోలో ఒక పోలీస్ అధికారి స్క్రీన్ మీద ప్ర‌భాస్ ప్రొఫైల్ చూస్తూ డైలాగ్ చెప్పే సంద‌ర్భంలో… అక్క‌డ పోలీస్ డ్రెస్‌లో ప్ర‌భాస్ ఫొటో, ప‌క్క‌న అశోక చ‌క్ర‌వ‌ర్తి అని అత‌డి పేరు క‌నిపిస్తాయి. సో… `సాహో`లో అశోక చ‌క్ర‌వ‌ర్తిగా ప్ర‌భాస్ సంద‌డి చేయ‌నున్నాడ‌న్న‌మాట‌. మ‌రి… `బాహుబ‌లి` సిరీస్‌తో దేశ‌వ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్న మ‌న డార్లింగ్‌… అశోక చ‌క్ర‌వ‌ర్తిగా మ‌రింత అభిమాన‌గ‌ణాన్ని పొందుతాడేమో చూద్దాం.

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా న‌టించిన‌ ఈ చిత్రానికి ఘిబ్రాన్ సంగీత‌మందించాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మ‌ల్టీలింగ్వ‌ల్‌ మూవీ… ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=SWvk8RLb86g]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 7 =