తెలుగు చిత్రాలకు వరించిన జాతీయ అవార్డులు

Tollywood Shines in the 66th National Film Awards for 2018

నేడు ఢిల్లీ వేదికగా 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని.. వాటిలో ఉత్తమమైన సినిమాలకు అవార్డులను ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అవార్డులను ప్రకటించి మేలో ప్రదానం చేయాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా వేశారు. ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మన తెలుగు సినిమాలకు కూడా పలు అవార్డులు దక్కాయి. మన తెలుగు సినిమాల్లో మొత్తం నాలుగు సినిమాలకు గాను ఏడు క్యాటగిరీలలో అవార్డులు దక్కాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహానటి సావిత్రి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన “మహానటి” చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి(కీర్తి సురేష్), ఉత్తమ కాస్ట్యూమ్ విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. అలాగే దర్శకుడు సుకుమార్,రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “రంగస్థలం” మూవీ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో అవార్డు పొందింది. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ప్రయోగాత్మ చిత్రం “అ”, బెస్ట్ మేకప్, బెస్ట్ వి ఎఫ్ ఎక్స్ విభాగాలలో అవార్డులు గెలుపొందగా, దర్శకుడు రాహుల్ రవీంద్ర డైరెక్షన్ లో సుశాంత్ హీరోగా తెరకెక్కించిన “చిలసౌ” మూవీ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డు పొందడం జరిగింది.

ఇంకా ఏయే సినిమాలకు ఏయే కేటగిరిలో అవార్డ్స్ వచ్చాయో చూద్దాం..

ఉత్తమ చిత్రం: హెల్లారో(గుజరాతీ)
ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్‌(ఉరి)
ఉత్తమ నటుడు: ఆయుష్మాన్‌ ఖురానా(అంధాధున్‌), విక్కీ కౌశల్‌(ఉరి)
ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌(మహానటి)
ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్‌ కిర్‌కిరే(చంబక్‌)
ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ(బదాయ్‌ హో)
ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపథ్య చిత్రం: పానీ(మరాఠీ)
ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్‌మ్యాన్‌
ఉత్తమ వినోదాత్మక చిత్రం: బదాయ్‌ హో
ఉత్తమ పరిచయ దర్శకుడు: సుధాకర్‌రెడ్డి యాకంటి(నాల్‌: మరాఠీ)
జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్‌
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి
జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్‌
జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్‌
ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్‌ లీలా భన్సాలీ(పద్మావత్‌)
జాతీయ ఉత్తమ యాక్షన్‌ చలన చిత్రం: కేజీఎఫ్‌
ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం (రాజా కృష్ణన్)
ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రం: చి||ల||సౌ||
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: ‘అ!’(తెలుగు) కేజీఎఫ్‌(కన్నడ)
ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ)
ఉత్తమ మేకప్‌: ‘అ!’
ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌: మహానటి
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: కమ్మార సంభవం(మలయాళం)
ఉత్తమ ఎడిటింగ్‌: నాతిచరామి(కన్నడ)
ఉత్తమ సౌండ్‌ డిజైనింగ్‌: ఉరి
ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీప్‌ప్లే: అంధాధున్‌
ఉత్తమ సంభాషణలు: తారీఖ్‌(బెంగాలీ)
ఉత్తమ గాయని: బిందుమాలిని(నాతి చరామి: మాయావి మానవే)
ఉత్తమ గాయకుడు: అర్జిత్‌సింగ్‌(పద్మావత్‌: బింటే దిల్‌)
ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్‌, షాహిబ్‌ సింగ్‌, తలాహ్‌ అర్షద్‌ రేసి, శ్రీనివాస్‌ పోకాలే
నర్గీస్‌ దత్‌ అవార్డు: వండల్లా ఎరడల్లా(కన్నడ)

[subscribe]

[youtube_video videoid=GTagL0R1QLc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − one =