సాహో లో నటిస్తున్న వారి లుక్స్ ను వరుసగా రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే సాహో లో విలన్స్ గా నటిస్తున్న వారి లుక్స్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న మందిరా బేడీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. కల్కీ అనే పాత్రలో మందిరా నటిస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటగా నీల్ నితిన్ ముకేశ్,తరువాత అరుణ్ విజయ్, ఛంకీ పాండే, లాల్ నిన్న జాకీ ష్రాఫ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.మరి వీరిని చూస్తుంటేనే ప్రభాస్ సాహోలో ఏరేంజ్ యాక్షన్ చూపించనున్నాడో అర్థం అవుతుంది కదా.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మురళీ శర్మ, వెన్నెల కిషోర్, మందిరా బేడీ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈనెల 30న భారీగా విడుదల కానుంది.
[youtube_video videoid=8KwZW-wH0PI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: