రివ్యూ – అనసూయ అభినయం హైలైట్ గా సాగిన “ కథనం”

2019 Telugu New Movie Reviews, Kathanam Movie Mouth Talk, Kathanam Movie Public Talk, Kathanam Movie Rating, Kathanam Movie Review, Kathanam Movie Story, Kathanam Review, Kathanam Telugu Movie Live Updates, Kathanam Telugu Movie Public Response, Kathanam Telugu Movie Review, Kathanam Telugu Movie Review And Rating, Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

రెగ్యులర్ యాంకర్ గా, అడపాదడపా ప్రత్యేక పాత్రల ప్రత్యేక తరహా నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అనసూయ ఒక ఫుల్ లెంగ్త్ లీడ్ క్యారెక్టర్ లో నటించడమే హైలైట్ గా ప్రచారం జరిగిన చిత్రం ” కథనం”. విపరీతమైన వ్యూవర్షిప్ ఉన్న ‘జబర్దస్త్’ ప్రోగ్రాం తో పాటూ మరికొన్ని టీవీ షోస్ ద్వారా household name గా ఎదిగిన అనసూయ క్షణం, రంగస్థలం చిత్రాలలో పోషించిన పాత్రల ద్వారా నటిగా కూడా విశేషమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రధాన పాత్రలో సినిమా వస్తుంది అంటే సహజంగా ఏర్పడే క్యూరియాసిటీ వల్ల “కథనం” సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. సో… మంచి అంచనాల మధ్య ఈ రోజు విడుదలైన “కథనం ” ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అను (అనసూయ భరద్వాజ్) సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వటం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. రోజు సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నిర్మాతలకు, హీరోలకు కథలు చెబుతూ ఉంటుంది. ఆమెకు అసిస్టెంట్ కం ఫ్రెండ్ గా తిరుగుతుంటాడు ధన ( ధనరాజ్). కానీ ఆమె ప్రయత్నాలు ఏమీ ఫలించవు. చివరకు ఆమె చెప్పిన కథ కాకుండా మా దగ్గర ఒక కథ ఉంది ఆ కథకు బెటర్మెంట్ ఇస్తే నీకే డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాం అంటూ నలుగురు నిర్మాతల సిండికేట్ ఆమెకు ఆఫర్ ఇస్తారు. అప్పుడు వాళ్ళు చెప్పిన కథ నే ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ గా తయారుచేసి వాళ్లకు ఇస్తుంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేద్దాం అంటారు. కానీ ఇంతలోనే నగరంలో కొన్ని దారుణ హత్యలు చోటుచేసుకుంటాయి. కచ్చితంగా తాను నిర్మాతలకు ఇచ్చిన థ్రిల్లర్ స్క్రిప్ట్ లో మర్డర్స్ ఎలా ప్లాన్ చేసిందో వరుసగా అలాంటి హత్యలే జరగటంతో పోలీసులను కలిసి ఈ విషయం చెప్పింది. తన స్క్రిప్ట్ లో మరో రెండు హత్యలు ఉన్నాయని అవి జరగకుండా ఆపాలని పోలీస్ ఆఫీసర్ రణధీర్ తో చెప్తుంది. అప్పుడు అనసూయతో కలిసి ఆ హత్యల వెనుక మిస్టరీని ఛేదించడానికి వెళ్లిన పోలీస్ ఆఫీసర్ రణధీర్ కు తెలిసిన దిగ్భ్రాంతికర వాస్తవాలు ఏమిటి? స్క్రిప్ట్ ప్రకారమే రెండు హత్యలు చేసిన అగంతకులు మిగిలిన రెండు హత్యలను చేయగలిగారా ?లేదా? అసలు అనసూయ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? ఆమె ఎవరు? ఆ హత్యలకు ఆమెకు సంబంధం ఏమిటి ? అసలు డైరెక్టర్ కావాలి అని కలలు కన్న అను హత్యా నేరంలో ఎలా ఇరుక్కుంది? ఇలాంటి అనేక సందేహాలకు సమాధానంగా నిలుస్తుంది ” కథనం” క్లైమాక్స్.

ఇక ఈ సినిమాను నూతన దర్శకుడు రాజేష్ నాదెళ్ల తెరకెక్కించిన విధానం ఆహా.. ఓహో.. అద్భుతం అనలేము కాని ఎంచుకున్న కథను ఆసక్తిదాయకంగా ఆవిష్కరించగల గాడు. ముఖ్యంగా మెయిన్ స్టోరీ పార్ట్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుండి కథ, కథనాలను ఇంట్రెస్టింగ్గా నడిపించాడు. టేకింగ్, షాట్ కంపోజింగ్ ల విషయంలో ఒక ఎక్స్పీరియన్స్ డ్ డైరెక్టర్ లాగా మంచి పరిణితి కనబరిచాడు. స్క్రిప్టులో రాసుకున్న విధంగా హత్యలు జరగటం, వాటిమీద ఇన్వెస్టిగేషన్, ఇంటరాగేషన్ జరగటం అనే పాయింట్ లోనే ఒక నావేల్టీ ఉంది. మామూలుగా అయితే ఒక రెగ్యులర్ ఓల్డ్ ఏజ్ రివెంజ్ స్టోరీలా మిగిలిపోయే కథను ఒక డిఫరెంట్ యాంగిల్ లో నరేట్ చేయటంలో డెబ్యూ డైరెక్టర్ రాజేష్ నాదెళ్ల చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అయితే మిగతా సినిమా మొతాన్ని చాలా చక్కగా హ్యాండిల్ చేసిన దర్శకుడు అనసూయ డైరెక్టర్ కావడం కోసం చేసే ప్రయత్నాల “ఫిల్మి ట్రాక్” ను మాత్రం చాలా చప్పగా, అమెచ్యూరిష్ గా తీశాడు. ఆ పర్టిక్యులర్ ట్రాక్ మినహాయిస్తే మిగతా సినిమా మొత్తం బాగుంది… ఎక్కడా బోర్ అనిపించదు.

ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం మీద సర్వాంతర్యామిగా కనిపించేది అనసూయ మాత్రమే. వర్తమానంలో అనుగా, పాతికేళ్ల నాటి ఫ్లాష్ బ్యాక్ లో ఊరి ప్రజల కష్టాలు తీర్చే అమ్మగా రెండు విభిన్న పార్శ్వాలున్న పాత్రలో చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కనబరిచింది అనసూయ. ఇలాంటి ఫుల్ లెంగ్త్ సోలో యాక్షన్ ఓరియంటెడ్ సస్పెన్స్ త్రిల్లర్ అనసూయకు దొరకటం చాలా అరుదైన అవకాశం… ఆ అవకాశాన్ని అన్ని విధాల సద్వినియోగం చేసుకొని నటిగా మరో మెట్టు ఎక్కింది అనసూయ. ఇక ఇతర నట వర్గంలో ఏసీపీ పాత్ర పోషించిన రణధీర, ధనరాజ్, వెన్నెల కిషోర్ , పృధ్వి, సమీర్ తదితరులు up to their charectors చేశారు. ఎవ్వరూ ఊహించని ఒక సస్పెన్స్ క్యారెక్టర్ లో విలక్షణ నటుడు రచయిత దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నాడు.

ఇక టెక్నికల్ గా ఎవరి పనులు వాళ్ళు up to అన్నట్లు గా చేశారు. ప్రత్యేక ప్రశంసలు… ప్రత్యేకించి విమర్శలు చేయాల్సిన అవసరం లేని అవుట్ పుట్ కనిపిస్తుంది. తొలి చిత్ర దర్శకుడిగా రాజేష్ నాదెళ్లకు అవకాశం ఇచ్చిన నిర్మాతలు నరేంద్ర రెడ్డి ,చుక్కా శర్మల మేకింగ్ స్టాండర్డ్స్ కథానుగుణంగా ఉన్నాయి. ఇలాంటి నూతన నిర్మాతలు నిలబడ్డప్పుడే పరిశ్రమకు నిజమైన మేలు జరిగినట్లు. కొత్త దర్శకులు ఎవరైనా తొలి అవకాశం ఇచ్చిన నిర్మాతల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలి. అలాంటి లక్ష్యాన్ని రాజేష్ నాదెళ్ల ఏ మేరకు అందుకుంటాడో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=kxrlR7SGS_A]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =