సాహో మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్

2019 Latest Telugu Film News, Saaho Movie Trailer Release Date Locked, Saaho Movie Trailer Release Date Conformed, Saaho Movie Trailer Release Date Fixed, Saaho Movie Trailer Release Date Out, Saaho Movie Trailer Release Date, Saaho Movie Trailer Release Date Announced, Saaho Movie Movie Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

UV క్రియేషన్స్, T- సిరీస్ బ్యానర్స్ పై యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వం లో తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 30 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందిన సాహో మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కారణంగా మేకర్స్ భారీ ఎత్తున మూవీ ప్రమోషన్స్ ను చేపట్టారు. హీరో ప్రభాస్ టూర్ షెడ్యూల్ ను నిర్మాతలు రూపొందించారు.

నటీనటుల ఫస్ట్ లుక్స్, మేకింగ్ వీడియోస్, టీజర్, సాంగ్స్ తో ప్రేక్షకులలో ఆసక్తి ని కలిగించిన చిత్ర యూనిట్ దేశంలోని ప్రధాన నగరాలలో సాహో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసింది. ఆగస్ట్ 10 వ తేదీ ముంబై, 11 హైదరాబాద్, 12 చెన్నై , 13 కొచ్చి, 14 న్యూ ఢిల్లీ లలో ట్రైలర్ రిలీజ్ కానుంది. బెంగళూరు , మరికొన్ని నగరాల డేట్స్ ఫిక్స్ కాలేదు. ఆగస్ట్ 17 వ తేదీ నుండి ప్రభాస్ అన్ని రాష్ట్రాలలో
పర్యటించి మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటారు. 20 వ తేదీ తరువాత హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. 27 వ తేదీ దుబాయ్ లో భారీ ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీస్ హాజరవుతారని సమాచారం. 29 వతేది దుబాయ్ లో సాహో మూవీప్రీమియర్ షో కూడా ఉండే అవకాశం ఉంది.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here