‘రాయల సింహా’గా బాల‌య్య?

2019 Latest Telugu Film News, Balakrishna & KS Ravikumar movie titled as Rayala Simha, Balakrishna Next Movioe titled Rayala Simha, Balakrishna Next Movie Rayala Simha, Rayala Simha Movie latest News, Balakrishna & KS Ravikumar Movie Latest Updates, Rayala Simha Movie by Bala Krishna, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

‘జై సింహా’ త‌రువాత క‌థానాయ‌కుడు నందమూరి బాల‌కృష్ణ – ద‌ర్శ‌కుడు కె.య‌స్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. పవర్ ప్యాక్డ్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో… పోలీస్ ఆఫీస‌ర్‌గానూ, గ్యాంగ్‌స్ట‌ర్‌గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాల‌య్య కనిపించనున్నట్టు సమాచారం. బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్‌ నాయికలుగా నటించనున్నట్టు తెలుస్తోంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ స్వరాలు సమకూరుస్తున్నాడు. కాగా… ఈ చిత్రానికి ఆ మ‌ధ్య ‘రూల‌ర్‌’, ‘క్రాంతి’ అనే టైటిల్స్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా స‌మాచారం ప్ర‌కారం… ‘రాయల సింహా’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసే ప‌నిలో ఉంద‌ట చిత్ర‌బృందం. బాలయ్యకు `సింహా` టైటిల్స్ బాగా కలసి రావడంతో ఇప్పుడు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి కూడా అదే సెంటిమెంట్‌ను కొనసాగించనున్నారని టాక్. త్వ‌ర‌లోనే ఈ టైటిల్‌పై ఫుల్ క్లారిటీ వ‌స్తుంది.

ఇదిలా ఉంటే… ఆగస్టు 9 నుంచి బ్యాంకాక్‌లో తొలి షెడ్యూల్‌ను జ‌రుపుకోనుందీ చిత్రం. ఇందులో భాగంగానే నాయకానాయికలపై ఓ పాటను చిత్రీకరించనున్నారని టాక్. కాగా… బాలయ్య కెరీర్‌లో 105వ చిత్రంగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌… 2019 క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబర్ 21న విడుదల కానుందని సమాచారం. ఇదివ‌ర‌కు ఈ చిత్రాన్ని వేస‌విలో విడుద‌ల చేయ‌నున్నార‌ని వార్త‌లు వినిపించాయి. అయితే, క్రిస్మ‌స్ టార్గెట్‌గా ఈ సినిమా రానుంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.[subscribe]

[youtube_video videoid=-liXVlw8X4s]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =