హీరోగా సినీపరిశ్రమలో అడుగుపెట్టి ఇప్పుడు డైరెక్టర్ గా బిజీ అయ్యాడు రాహుల్ రవీంద్రన్. చి.ల.సౌ తో తొలి సినిమాకు దర్శకత్వం వహించి మొదటి సినిమాకే మంచి మార్కులు కొట్టేసాడు. మళ్ళీ అదే అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున ప్రధానపాత్రలో మన్మథుడు 2 సినిమా చేసేసాడు. ఈ సినిమా ఈ నెల 9వ తేదీన రిలీజ్ కానుంది. అన్నీ కుదిరితే నాగచైతన్య తో కూడా సినిమా తీసే అవకాశం వుంది. అయితే ప్రస్తుతం చైతన్య ఖాళీ లేడు. వెంకీ మామ తరువాత శేఖర్ కమ్ముల సినిమా చేయాల్సివుంది. అలాగే అన్నీ కుదిరితే మేర్లపాక గాంధీ డైరక్షన్ లో ఓ సినిమా చేయాల్సి వుంది. అలాగే దిల్ రాజుకు ఓ సినిమా చేయాల్సివుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. రాహుల్ మరో స్టార్ ప్రొడ్యూసర్ తనయుడిని లాంచ్ చేయనున్నట్టు తెలుస్తుంది. అది ఎవరో కాదు. టాప్ ప్రొడ్యూసర్ అయిన సురేష్ బాబు కొడుకు అభిరామ్. అభిరామ్ ను లాంచ్ చేసే భాద్యతను రాహుల్ కి అప్పచెప్పాడంటా సురేష్ బాబు. అయితే ప్రస్తుతం ఇవి రూమర్లు గానే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం క్లారిటీ వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=TLWmy4u_qYY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: