హీరోలు చేస్తే కరెక్ట్ – మేము చేస్తే తప్పా?

2019 Latest Telugu Film News, Rahul Ravindran about Rakul Preet Smoking Controversy, Rakul Preet reacts after being trolled over smoking scene, Rakul Preet smokes in Manmadhudu 2, Rakul Preet Singh trolled for smoking in Manmadhudu 2,Controversy After watching Rakul Preet smoking scene, Rakul Preet Smoking Controversy, Manmadhudu 2 Movie Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Rahul Ravindran about Rakul Preet Smoking Controversy

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మన్మథుడు 2’. ఆగష్ట్ 9వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా పాల్గొంటుంది చిత్ర యూనిట్. దీనిలో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నాలుగు పాటలు, సీన్లు ఉన్న పాత్ర కంటే.. నటనకు ఆస్కారం ఉన్న విభిన్నమైన పాత్రలో నటించడానికే ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. అంతే కాదు.. ఈ సినిమాలో తాను స్మోకింగ్ చేయడంపై కూడా స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ సినిమాలో నేను స్మోకింగ్ చేస్తూ కనిపించా.. దీనిపై పెద్ద చర్చ జరిగింది… మన దేశంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కానీ మనం కొన్ని విషయాల్ని మాత్రమే స్వీకరిస్తాం. ఎందుకంటే.. సమాజం ఏం అంటుందోననే భయం. స్క్రీన్‌పై అలాంటివి చెబితే, చేస్తే.. తప్పు అంటారు. అందుకే ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అని ముందే గమనికగా చూపిస్తాం. ఈ సినిమాలో అవంతిక స్మోక్ చేస్తుంది.. ఆ క్యారెక్టర్ అలాంటిది.. .. ప్రేక్షకులు ఇలాంటివి జీర్ణించుకోలేరు. సమాజంలో ఎంతో మంది పొగ తాగుతున్నారు. కానీ మనం వాటి గురించి మాట్లాడం. హీరో పొగతాగితే తప్పు కాదంటారు.. అదే హీరోయిన్‌ తాగితే మాత్రం తప్పు అంటారు. సినిమాలో అది పాత్ర వరకే పరిమితం’. మరి రకుల్ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూద్దాం.

కాగా ఈ సినిమాలో ఇంకా సమంత, కన్నడ బ్యూటీ అక్షరా గౌడ, కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. వెన్నెల కిషోర్, నాజర్, రావు రమేష్, లక్ష్మీ, ఝాన్సీ తదితరులు నటిస్తున్నారు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున‌, పి.కిర‌ణ్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here